అన్వేషించండి

AP SSC Exam Fee: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్‌, పరీక్ష ఫీజు గడువు పొడిగింపు - ఎప్పటిదాకా చెల్లించవచ్చంటే?

10Th Class Fee : ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం నవంబరు 9న ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సౌలభ్యం కోసం మరో 10 రోజులపాటు అవకాశం కల్పించారు.

Andhra Pradesh SSC Fee date:  ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి నవంబరు 9న ఆదేశాలు జారీ చేశారు. ఫీజు దరఖాస్తు గడువు నవంబరు 10తో ముగియనుండగా.. విద్యార్థుల సౌలభ్యం కోసం మరో 10 రోజులపాటు అవకాశం కల్పించారు. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబరు 20 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఆపై రూ.50, రూ.200, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించొచ్చని పేర్కొన్నారు.

రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 11 నుంచి 16 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 17 నుంచి 22 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో నవంబరు 23 నుంచి 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టంచేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 31.08.2023 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఫీజు చెల్లింపు తేదీలు..

➥ రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 21 నుంచి నవంబరు 25 వరకు 

➥ రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 26 నుంచి నవంబరు 30 వరకు 

➥  రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 1 నుంచి డిసెంబరు 5 వరకు. 

ఫీజు చెల్లింపు వివరాలు..

➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే వారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

➥ 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే వారు రూ.110 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే వారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

➥ ప్రైవేటు విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం అదనంగా రూ.650 చెల్లించాల్సి ఉంటుంది.

➥ మూగు, చెవుడు, అంధ విద్యార్థులకు పరీక్ష ఫీజు, హాజరు మినహాయింపు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 40 శాతం పైగా ప్రభావం ఉన్నవాళ్లను దివ్యాంగుల కేటగిరీ పరిగణిస్తారు.

➥ మూగ, చెవుడు విద్యార్థులకు రెండు భాషా సబ్జెక్టుల నుంచి మినహాయింపు ఉంది. అంధ అభ్యర్థులు స్క్రైబ్ తీసుకోవడానికి అర్హులు.

➥ లాంగ్వే్జ్ సబ్జెక్టుల నుంచి మినహాయింపు కోరే దివ్యాంగ విద్యార్థులు ముందుగా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.


AP SSC Exam Fee: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్‌, పరీక్ష ఫీజు గడువు పొడిగింపు - ఎప్పటిదాకా చెల్లించవచ్చంటే?AP SSC Exam Fee: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్‌, పరీక్ష ఫీజు గడువు పొడిగింపు - ఎప్పటిదాకా చెల్లించవచ్చంటే?AP SSC Exam Fee: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్‌, పరీక్ష ఫీజు గడువు పొడిగింపు - ఎప్పటిదాకా చెల్లించవచ్చంటే?

'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు..
ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/పార్శి పేపర్లకు అమలు చేయనుంది. మొదట కాంపోజిట్ పేపర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వచ్చే సంవత్సరం నుంచి తొలగించాలని నిర్ణయించింది. కాంపోజిట్ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సంస్కృతం 30 మార్కులకు ఉంటుంది. 

ఏడు పేపర్లతోనే పరీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు యథావిధిగా ఉంటాయి. 

ప్రశ్నపత్రాల్లో మార్పులు..

తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతుండటంతో ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేశారు. 

➥ తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.

➥ రెండో ప్రశ్నగా ఇప్పటి వరకు పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున మార్కులు ఉంటాయి.

➥ హిందీలో విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నపత్రాన్ని మార్చేశారు. గతంలో బిట్ పేపర్‌ను తొలగించగా.. ఇప్పుడు అదేవిధానాన్ని తీసుకొచ్చారు. 14 ఒక మార్కు ప్రశ్నలు, 19 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలే అధికం.

మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..

 

టాప్ హెడ్ లైన్స్

Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget