ఏప్రిల్ 20 నుంచి 'సమ్మెటివ్-2' పరీక్షలు, షెడ్యూలు ఇదే!
ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 20 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ ఇటీవల విడుదల చేశారు.
ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 20 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ ఇటీవల విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..
➥ ఏప్రిల్ 20, 24, 25 తేదీల్లో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.
➥ ఏప్రిల్ 26న 3, 4, 5 తరగతులకు పర్యావరణ శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నారు.
➥ ఏప్రిల్ 20, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో 6, 8వ తరగతుల విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.
➥ అదేవిధంగా ఏప్రిల్ 20, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో 7, 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ పదోతరగతి పరీక్షల మాదిరిగానే 9వ తరగతికి విద్యార్థులకు కూడా 6 పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులు..
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. కొత్త విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. మొత్తానికి ఏపీ పాఠశాల విద్యార్థులకు సుమారు 45 రోజులు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
Also Read:
సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్ సెషన్-2 అడ్మిట్ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మార్చి 6 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం (ఏప్రిల్ 3న) సాయంత్రం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్లలో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది.
జేఈఈ మెయిన్ అడ్మిట్‌కార్డు కోసం క్లిక్ చేయండి..
SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!
తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఏప్రిల్ 10న సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..