News
News
వీడియోలు ఆటలు
X

AP POLYCET Counselling: పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం, జూన్ 1 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం!

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం (మే 25) ప్రారంభమైంది. అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 1 వరకు ప్రాసెసింగ్‌ ఫీజుా చెల్లించాల్సి ఉంటుంది.

FOLLOW US: 
Share:

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం (మే 25) ప్రారంభమైంది. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 1 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

ఫీజు చెల్లించిన విద్యార్థులకు మే 29 నుంచి జూన్‌ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్‌ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్‌ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి క్లిక్ చేయండి..

కౌన్సెలింగ్ వెబ్‌సైట్

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ఇలా..

కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు: 25.05.2023 - 01.06.2023.

ధ్రువపత్రాల పరిశీలన: 29.05.2023 - 05.06.2023.

వెబ్‌ఆప్షన్ల నమోదు: 01.06.2023 - 06.06.2023.

వెబ్‌ఆప్షన్లలో మార్పునకు అవకాశం: 07.06.2023.

సీట్ల కేటాయింపు: 09.06.2023.

తరగతుల ప్రారంభం: 15.06.2023.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలా..

తేదీ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంకు వరకు
29.05.2023 1 12000
30.05.2023 12001 27000
31.05.2023 27001 43000
01.06.2023 43001 59000
02.06.2023 59001 75000
03.06.2023 75001  92000
04.06.2023 92001 108000
05.06.2023 108001  చివరి ర్యాంకు వరకు

ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి..

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన అభ్యర్థులు దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం హాజరుకాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తమ తీసుకెళ్లా్ల్సి ఉంటుంది.

➥ పాలిసెట్ హాల్‌టికెట్

➥ పాలిసెట్ ర్యాంకు కార్డు

➥ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రసీదు

➥ పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతల మార్కుల మెమో (ఒరిజినల్/ఇంటర్నెట్ కాపీ)

➥ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ (లేదా) రెసిడెన్స్ సర్టిఫికేట్ (లేదా) విద్యార్థి తల్లిదండ్రులు స్థానికేతరులు అయితే 10 సంవత్సరాల నుంచి ఏపీలో ఉంటున్నట్లుగా తల్లిదండ్రుల్లో ఎవరికైనా నివాస ధృవీకరణ పత్రం ఉండాలి.

➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2023-24) మీసేవా నుంచి పొంది ఉండాలి. 

➥ 01.01.2020 తర్వాత పొందిన ఆధాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఇది ఉంటేనే ఫీజు రీయింబెర్స్‌మెంట్ పొందడానికి అర్హులు.

➥ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ).

➥ అవసరమైన వారు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 02.06.2014 - 01.06.2021 మధ్య తెలంగాణ నుంచి ఏపీకి వలసవచ్చిన వారు తప్పనిసరిగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

➥ అవసరమైన అభ్యర్థులకు పీహెచ్ (PH)/క్యాప్(CAP)/ఎన్‌సీసీ)(NCC)/స్పోర్ట్స్(Sports)/స్కౌట్స్ & గైడ్స్(Scouts & Guides)/ మైనారిటీ (Minority)/ ఆంగ్లో ఇండియన్ (Anglo-Indian) సర్టిఫికేట్లు అవసరం అవుతాయి. నిబంధనల ప్రకారం ఆయా సర్టిఫికేట్లు ఉండాలి.

Also Read:

ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్‌-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్‌ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 25 May 2023 05:45 PM (IST) Tags: Education News in Telugu AP Polycet 2023 Counselling Polycet 2023 Counselling AP Polycet 2023 Counselling Schedule Polycet 2023 Counselling Dates

సంబంధిత కథనాలు

పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12