News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

APOSS: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల, ముఖ్యమైన తేదీలివే!

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన వెలువడింది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన వెలువడింది. ఈ మేరకు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి జులై 26న ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ జులై 27 నుండి ప్రారంభంకానుంది. విద్యార్థుల నుంచి ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి జులై 28న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏపీఓఎస్‌ఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియపై 'ఓరియంటేషన్‌ ప్రోగ్రాం'ను తప్పనిసరిగా నిర్వహించాలని.. జులై 31 నుండి ఆగస్టు 5 వరకు ప్రవేశాలకు సంబంధించి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో అధ్యయన కేంద్రాల నిర్వాహకులతో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఏపీ ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌కోరారు.

Website

ALSO READ:

ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో బీఎఫ్‌ఎస్‌సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్‌యూ) క్యాంప్ ఆఫీస్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్(ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్‌ 2023 ర్యాంక్ సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆగస్టు 07వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొవచ్చు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నల్సార్‌ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ఫీజులు ఖరారు, ఫీజులు ఎంతమేర పెరిగాయంటే?
ఏపీలో 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య, డెంటల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జులై 25న ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఫీజుల అమలు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022–23లో అమలైన ఫీజులను 10 శాతం పెంచుతూ కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

NIMS: నిమ్స్‌‌లో ఎంఎస్సీ ప్రోగ్రామ్‌, ప్రవేశ వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 2023 విద్యాసంవత్సరానికి జెనెటిక్ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ(లైఫ్ సైన్సెస్)/ బీఈ, బీటెక్‌ (బయోటెక్నాలజీ/ జెనెటిక్ ఇంజినీరింగ్/ బయోమెడికల్ ఇంజినీరింగ్/ బయోలాజికల్ సైన్సెస్) లేదా ఎంబీబీఎస్‌/ బీడీఎస్ ఉత్తీర్ణత దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆగస్టు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 09 వరకు దరఖాస్తు హార్డ్ కాపీలు సమర్పించవచ్చు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 27 Jul 2023 05:47 AM (IST) Tags: Education News in Telugu AP Open School Society APOSS Notification APOSS Admission Notification APOSS Tenth Admissions APOSS Inter Admissions

ఇవి కూడా చూడండి

UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సరికొత్త సిలబస్‌, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి

TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సరికొత్త సిలబస్‌, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి

CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు

CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత