అన్వేషించండి
Advertisement
AP Inter model paper 2023: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోటనీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది? ఏ చాప్టర్ నుంచే ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
AP Inter model paper 2023: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోటనీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది? ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు వస్తాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ – వృక్షశాస్త్రం
ఇంటర్ పరీక్షలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు చదివింది ఓ లెక్క ఇకపై చదివేది ఓ లెక్క. ఇకపై చదవాల్సింది రివిజన్ మోడ్‌లోనే ఉండాలి. మొత్తంగా చదువుతామంటే వెనుకబడిపోతారు. అందుకే మీ సౌలభ్యం కోసం ఇకపై ప్రతి సబ్జెక్ట్ మోడల్ పేపర్లను మేము మీకు అందిస్తాం. విద్యార్థులు ఆ మోడల్ పేపర్‌లను ప్రాక్టీస్ చేసినట్టైతే మంచి మార్కులు సాధిస్తారు. ముందుగా అసలు ఇంటర్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం.
- ఇంటర్ ఫస్ట్, సెంకడ్ ఇయర్ వృక్షశాస్త్ర(Botany) క్వశ్చన్ పేపర్ 60కి ఉంటుంది. ఇందులో 21 మార్కులు వస్తే పాస్ అవుతారు.
- ఈ క్వశ్చన్ పేపర్ మూడు పార్ట్స్ ఉంటాయి. అవి ‘A’ , ‘B’ ‘C’.
- పార్ట్ - ‘A’ లోని అన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ రాయాలి,
- పార్ట్ -‘B’ లో ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఆరింటికి మాత్రమే ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది.
- పార్ట్-‘C’ లో మూడు ప్రశ్నలు ఇస్తారు. ఏవైనా రెండింటికి సమాధానాలు రాయాలి.
- పార్ట్ - ‘A’ లో 1 నుంచి 10 వరకు ఉన్న ప్రశ్నలు “అతి స్వల్ప” సమాధాన తరహా ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు ఇస్తారు.
- పార్ట్ -‘B’ లో 11 నుంచి 18 వరకు ఉండే ప్రశ్నలు “స్వల్ప” (షార్ట్) సమాధాన తరహావి. ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు ఇస్తారు.
- పార్ట్ -‘C’ లో 19 నుంచి 21 వరకు ఉండే ప్రశ్నలు “దీర్ఘ”(లాంగ్) సమాధాన తరహావి. ఒక్కొక్క ప్రశ్నకు ఎనిమిది మార్కులు ఇస్తారు.
- వృక్షశాస్త్ర ప్రథమ(ఫస్ట్) సంవత్సర ప్రశ్నాపత్రంలో ఏ చాప్టర్స్ నుంచి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందంటే…
- అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు (2 మార్కులు) - 1,2,3,5 (2 ప్రశ్నలు), 8,9,10,11, 13 అధ్యాయాలు నుంచి ఈ విభాగంలో క్వశ్చన్స్ రావచ్చు.
- స్వల్ప సమాధాన ప్రశ్నలు (4 మార్కులు)- 2,4,6,8,9,11,12, 13 అధ్యాయాలు నుంచి ఇస్తారు,
- దీర్ఘ సమాధాన ప్రశ్నలు (8 మార్కులు) - 5,7, 12 అధ్యాయాలు నుంచి వస్తాయి.
- వృక్షశాస్త్ర ద్వితీయ(సెకండ్) సంవత్సర ప్రశ్నాపత్రంలో ఏ చాప్టర్స్ నుంచి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందంటే…
- అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు (2 మార్కులు) - 1,4,7,9,10 (2 ప్రశ్నలు), 11,12, 13, 14 అధ్యాయాలు నుంచి క్వశ్చన్స్ వస్తాయి,
- స్వల్ప సమాధాన ప్రశ్నలు (4 మార్కులు)- 1, 2,3,6,8,9,10, 12 అధ్యాయాలు నుంచి రావచ్చు,
- దీర్ఘ సమాధాన ప్రశ్నలు (8 మార్కులు) - 5,11, 13 అధ్యాయాలు నుంచి వస్తాయి.
మరిన్ని మోడల్ పేపర్‌ల కోసం ఏబీపీ దేశంను ఫాలో అవుతూ ఉండండి
జయ సుధాకర్, ప్రభుత్వ బోటనీ లెక్చరర్, శ్రీకాకుళం, 7989051224
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion