By: ABP Desam | Updated at : 03 Mar 2022 02:52 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్(Intermediate) పరీక్షలు వాయిదా(Postpone) పడ్డాయి. పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(Adimulapu Suresh) ప్రకటించారు. కొత్త తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జేఈఈ మెయిన్స్(JEE Mains) కారణంగా ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించింది. దీంతో పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ గురువారం తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ ఎప్పుడంటే?
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు మార్చి 11 నుంచి మార్చి 31వరకు జరుగుతాయని మంత్రి సురేశ్ తెలిపారు. కోవిడ్(Covid) నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు(Inter Board) తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి వెల్లడించారు.
Also Read: Telangana Inter Exams 2022: అలర్ట్! తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో మార్పు, కొత్త షెడ్యూల్ ఇదే
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
ఏపీలో మొత్తం 6,39,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.
Also Read: Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు
Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు
Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
Regional Parties Income : అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్సీపీకే సగం !
Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల