By: ABP Desam | Updated at : 03 Mar 2022 08:28 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో ఇంటర్ పరీక్షల (Telangana Inter Exams) నిర్వహణ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జేఈఈ అడ్వాన్స్ (JEE Advance) పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) ప్రకటించింది. బుధవారం ఇంటర్ బోర్డు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. అంతకుముందు తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ (Inter First Year Exams) పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలను (Inter First Second Year Exams) ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు.
ఈ సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఫస్ట్ ఇయర్, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహిస్తారు. అలాగే ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు ఉండనున్నాయి.
పరీక్షల పూర్తి టైమ్ టేబుల్.. (Inter Exams Time Table 2022)
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ.. (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)
ఏప్రిల్ 22 - పేపర్ - 1 తెలుగు/ సంస్కృతం
ఏప్రిల్ 25 - ఇంగ్లీష్ పేపర్ - 1
ఏప్రిల్ 27 - మాథ్స్ పేపర్ - 1A, బొటనీ పేపర్ - 1, పొలిటికల్ సైన్స్ పేపర్ - 1
ఏప్రిల్ 29 - మాథ్స్ పేపర్ - 1B జువాలజీ పేపర్ - 1, హిస్టరీ పేపర్ - 1
మే2 - ఫిజిక్స్ పేపర్ - 1, ఎకానమిక్స్ పేపర్ - 1
మే 6 - కెమిస్ట్రీ పేపర్ - 1, కామర్స్ పేపర్ - 1
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)
ఏప్రిల్ 23 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ - 2
ఏప్రిల్ 26 - ఇంగ్లిష్ పేపర్ - 2
ఏప్రిల్ 28 - మాథ్స్ పేపర్ - 2A, బోటనీ పేపర్ - 2, పొలిటికల్ సైన్స్ పేపర్ - 2
ఏప్రిల్ 30 - మాథ్స్ పేపర్ - 2B, జూవాలజీ పేపర్ - 2, హిస్టరీ పేపర్ - 2
మే 5 - ఫిజిక్స్ పేపర్ - 2, ఎకానమిక్స్ పేపర్ - 2
మే 7 - కెమిస్ట్రీ పేపర్ - 2, కామర్స్ పేపర్ - 2
JNTU Admissions: జేఎన్టీయూహెచ్లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, అర్హతలివే!
PGECET Seats: పీజీఈసెట్ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు
UK Visa Fee Hike: యూకే వీసా ఫీజు పెంపు విద్యార్థులు, కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
Inter Admissions: ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!
SA Exams: సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా
Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!
Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
/body>