అన్వేషించండి

AP ICET Application: ఏపీ ఐసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

AP ICET 2024: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు చేసుకోచ్చు.

APICET 2024 Application: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 3న వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.

రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 8 నుంచి 12 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 నుంచి 17 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6, 7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 2 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 

వివరాలు..

* ఏపీ ఐసెట్-2024

కోర్సుల వివరాలు..

1) ఎంసీఏ

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

2) ఎంబీఏ

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయోపరిమితి: 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఐసెట్ ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లిస్తే సరిపోతుంది. 

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).

ఏపీ ఐసెట్-2024 ముఖ్యమైన తేదీలు: 

➽ ఏపీఐసెట్-2024  నోటిఫికేషన్:  03.03.2024.

➽ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 06.03.2024. 

➽ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 07.04.2024.

➽ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 08.04.2024 - 12.04.2024.

➽ రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 13.04.2024 - 17.04.2024.

➽ రూ.3000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 18.04.2024 - 22.04.2024.

➽ రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 23.04.2024  - 27.04.2024.

➽ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం: 28.04.2024 - 29.04.2024.

➽ పరీక్ష హాల్‌టికెట్లు: 02.05.2024 నుంచి అందుబాటులో. 

➽ ఏపీ ఐసెట్ పరీక్ష నిర్వహణ: 06.05.2024, 07.05.2024 తేదీల్లో.
పరీక్ష సమయం: 09.00 AM - 11.30AM, 02.30 PM to 05.00 PM

➽ ప్రిలిమినరీ ఆన్సర్ కీ: 08.05.2024 – 06.00 PM

➽ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 10.05.2024 – 06.00 PM

➽ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాల వెల్లడి: 20.06.2024

Notification

Detailed Notification

Online Application

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget