అన్వేషించండి

AP ICET Counselling: ఏపీ ఐసెట్ - 2024 కౌన్సెలింగ్ ప్రారంభం - రిజిస్ట్రేషన్, వెబ్‌ఆప్షన్ల నమోదు తేదీలివే

AP ICET 2024: ఏపీలో ఐసెట్-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 26న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 10న సీట్లను కేటాయించనున్నారు.

AP ICET 2024 Web Counselling: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఐసెట్-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 26న ప్రారంభమైంది. ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 26 నుంచి ఆగస్టు 1 వరకు వెబ్‌ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.

రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి జులై 27 నుంచి ఆగస్టు 1 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. స్పెషల్ కేటగిరీ (పీహెచ్/క్యాప్/ఎన్‌సీసీ/స్పోర్ట్స్ & గేమ్స్/ఆంగ్లో ఇండియన్స్) అభ్యర్థులకు ఆగస్టు 2న ధ్రువపత్రాల పరిశీల చేపట్టనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 4 నుంచి 7 వరకు వెబ్ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లలో ఏమైనా మార్పులు ఉంటే ఆగస్టు 8న సరిచేసుకోవచ్చు. అభ్యర్థులకు ఆగస్టు 10న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు ఆగస్టు 12 నుంచి 16 మధ్య సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 12 నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి.

కౌన్సలింగ్ షెడ్యూలు..

  • నోటిఫికేషన్ విడుదల: 26.07.2024.
  • వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్: 26.07.2024 - 01.08.2024.
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్: 27.07.2024 - 03.08.2024.
  • స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన: 02 – 08 – 2024
  • వెబ్‌ఆప్షన్ల నమోదు: 04.08.2024 - 07.08.2024.
  • వెబ్‌ఆప్షన్ల మార్పుకు అవకాశం: 08.08.2024.
  • మొదటి విడత సీట్ల కేటాయింపు: 10.08.2024.
  • సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 12.08.2024 - 16.08.2024.
  • తరగతులు ప్రారంభం: 12.08.2024.
  • మిగిలిపోయిన సీట్ల వివరాలు వెల్లడి: 17.08.2024.

AP ICET 2024 కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

  • AP ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://icet-sche.aptonline.in/ICET/Views/index.aspx 
  • నిర్ణీత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
  • రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి.
  • అవసరమైన వివరాలను నింపాలి.
  • బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ఎంచుకోవాలి.
  • ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.
  • సేవ్ చేసిన ఎంపిక ప్రక్రియను ప్రింట్ తీసుకుని.. లాగ్ అవుట్ చేయండి.

కావాల్సిన డాక్యుమెంట్లు..

  • ఏపీ ఐసెట్ 2024 హాల్‌టికెట్
  •  ఏపీ ఐసెట్ 2024 ర్యాంకు కార్డు
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)
  • డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్
  • ఇంటర్ లేదా డిప్లొమా మార్కుల మెమో
  • పదోతరగతి మార్కుల మెమో
  • 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్లు
  • రెసిడెన్స్ సర్టిఫికేట్
  • ఇన్‌కమ్ సర్టిఫికేట్
  • కులధ్రువీకరణ సర్టిఫికేట్
  • ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
  • లోకల్ సర్టిఫికేట్
  • NCC/CAP, మైనార్టీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 6న ఐసెస్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 18,890 మంది బాలురు, 29,938 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు మొత్తం 44,446 మంది (91 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల్లో మొత్తం 96.71 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు.

Counselling Notification 

 

Candidate Registration

Know Your Payment Status

Print Your Application Form

 

Counselling Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Hasan Mahmud: అసలు ఎవరీ హసన్? అంత తోపా?  కోహ్లీ, రోహిత్‌నే అవుట్‌ చేసేంత బౌలరా ?
అసలు ఎవరీ హసన్? అంత తోపా? కోహ్లీ, రోహిత్‌నే అవుట్‌ చేసేంత బౌలరా ?
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget