AP ICET: ఏపీ ఐసెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, డిగ్రీ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24, 25 తేదీల్లో ఏపీ ఐసెట్-2023 ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీఐసెట్‌లో ర్యాంకు ద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఐసెట్ పరీక్షల బాధ్యత నిర్వహిస్తోంది.
ఏపీఐసెట్-2023 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 17న వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించారు. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించారు. అయితే రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో మే 4 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 11 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు మే 16, 17 తేదీల్లో అవకాశం కల్పించారు. తాజాగా పరీక్ష హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. మే 24, 25 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
Also Read:
ఆదర్శ పాఠశాలల్లో 'ఇంటర్' ప్రవేశాలు, మే 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ!
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభంకానుంది. ప్రవేశాలు కోరేవారి నుంచి మే 22 నుంచి జూన్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.
ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..