By: ABP Desam | Updated at : 20 May 2023 01:54 PM (IST)
Edited By: omeprakash
ఏపీ మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభంకానుంది. ప్రవేశాలు కోరేవారి నుంచి మే 22 నుంచి జూన్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఏపీ ఆదర్శ పాఠశాలలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సీట్లు పొందినవారికి ఉచిత విద్య అందిస్తారు. ఈ ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్య బోధిస్తారు.
వివరాాలు..
* ఏపీ ఆదర్శపాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు
అర్హతలు: సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీలకు రూ. 200. ఎస్సీ, ఎస్టీలకు రూ.150.
ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
6వ తరగతి దరఖాస్తుకు మే 25 వరకు అవకాశం..
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో ఉండగా మే 10 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు గడువు మే 25తో ముగియనుంది. జూన్ 11న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్ తో తెలుగు/ ఇంగ్లీషు మీడియములో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టైపులో ఉన్న ప్రవేశ పరీక్షలోఓసీ, బీసీ అభ్యర్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 30 మార్కులు సాధించాలి. ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించబడతాయి.
Also Read:
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.
ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
Eklavya Model Schools Results: ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Medical Colleges: దేశంలో 40 వైద్యకళాశాలల గుర్తింపు రద్దు, మరో 100కి పైగా కాలేజీలకు ఇదే గతి?
AP SSC Exams: ఏపీలో జూన్ 2 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారా?
TSLPRB Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదల, 84.06 శాతం మంది అర్హత!
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!