News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఏపీలో గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

ఏపీలో గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఐడీ లేదా హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.

పాఠశాల స్థాయిలో 5,6,7,8 తరగతులు, ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు 1.06 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 87,252 మంది హాజరయ్యారు. ఫలితాల్లో మొత్తం 82 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. పరీక్ష రాసిన వారందరికీ ర్యాంకులు కేటాయించారు. అన్నింటిలో కలిపి 4,852 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొదటి 4 వేల ర్యాంకులు సాధించిన వారికి మాత్రమే సీట్లు కేటాయిస్తారు.

5వ తరగతి ప్రవేశ పరీక్ష పలితాలు

6, 7, 8 తరగతుల ప్రవేశ పరీక్ష పలితాలు

ఏపీఆర్‌జేసీ 2023 ఫలితాలు

ఏపీఆర్‌డీసీ - 2023 ఫలితాలు

Also Read:

ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
తెలంగాణలో జూన్ 12 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,12,325 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం నుంచి 2,70,583 మంది,  ద్వితీయ సంవత్సరం నుంచి 1,41,742 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు. ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ పదోతరగతి హాల్‌టికెట్ నెంబర్ లేదా పాత హాల్‌టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు. హాల్‌టికెట్లలో ఏమైనా తప్పులుంటే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవచ్చు. 
ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 09 Jun 2023 05:20 PM (IST) Tags: Education News in Telugu AP Gurukula Entrance Exam Result APRJC Exam Result APRDC Results

ఇవి కూడా చూడండి

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష

Cyber Security Course: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు

Cyber Security Course: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు

Fake Universities: దేశంలో నకిలీ యూనివర్సిటీల జాబితా వెల్లడి, ఏపీలో రెండు 'ఫేక్' వర్సిటీలు

Fake Universities: దేశంలో నకిలీ యూనివర్సిటీల జాబితా వెల్లడి, ఏపీలో రెండు 'ఫేక్' వర్సిటీలు

AP EDCET: బీఎడ్ కౌన్సెలింగ్, జాబితా నుంచి 18 కళాశాలలు తొలగింపు

AP EDCET: బీఎడ్ కౌన్సెలింగ్, జాబితా నుంచి 18 కళాశాలలు తొలగింపు

APBIE: ఇంటర్‌ విద్యార్థులకు 'స్టడీ అవర్స్', వారికి 'హాజరు' ఫీజు గడువు నవంబరు 30 వరకు

APBIE: ఇంటర్‌ విద్యార్థులకు 'స్టడీ అవర్స్', వారికి 'హాజరు' ఫీజు గడువు నవంబరు 30 వరకు

టాప్ స్టోరీస్

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన  రౌస్ అవెన్యూ కోర్ట్ !

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!