News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది.

FOLLOW US: 
Share:

దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.

యూనివర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ-బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రెండో స్థానంలో, జామియా మిలియా ఇస్లామియా 3వ స్థానంలో నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానం దక్కించుకుంది. 

కళాశాలల విభాగంలో ఢిల్లీలోని మిరిండా హౌజ్ మొదటి స్థానంలో, హిందు కాలేజ్ రెండో స్థానంలో నిలిచాయి. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ 3వ స్థానం దక్కించుకుంది. కాలేజీల విభాగంలో తొలి 100 స్థానాల్లో హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ వుమెన్ మాత్రమే (98వ స్థానం) చోటు దక్కించుకుంది.

సెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ కేటగిరీలో ఐఐఎస్సీ-బెంగళూరు మొదటి స్థానంలో, ఐఐటీ-మద్రాస్ 2వ స్థానంలో, ఐఐటీ-ఢిల్లీ 3వ స్థానంలో నిలిచాయి. ఈ విభాగంలో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 28వ స్థానంలో నిలిచింది.

ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ-మద్రాస్ అగ్రస్థానంలో నిలవగా, వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-బాంబే, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-రూర్కీ నిలిచాయి. ఐఐటీ-హైదరాబాద్ 8వ స్థానం దక్కించుకుంది. ఎన్ఐటీ-వరంగల్ 21వ స్థానంలో, ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ 55వ స్థానంలో నిలిచాయి.

మేనేజ్‌మెంట్ విభాగంలో ఐఐఎం-అహ్మదాబాద్ అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-కోజికోడ్ నిలిచాయి. ఈ విభాగంలో ఐఐఎం-విశాఖపట్నం 29వ స్థానం దక్కించుకుంది.

ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-హైదరాబాద్ అగ్రస్థానం దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్-విశాఖపట్నం 22వ స్థానంలో నిలిచింది.

వైద్య విద్యలో ఢిల్లీ-ఎయిమ్స్ అగ్రస్థానంలో నిలవగా, రెండో స్థానంలో చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER), మూడో స్థానంలో వెళ్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి నిలిచాయి. తొలి 50 స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క మెడికల్ కాలేజీ కూడా చోటు దక్కించుకోలేకపోయింది. 

డెంటల్ విభాగంలో చెన్నైలోని సవిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో భీమవరంలోని విష్ణు డెంటల్ కాలేజి 26వ స్థానం దక్కించుకోగా సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 33వ స్థానంలో నిలిచింది.

లా విభాగంలో బెంగళూరులోని నేషనల్ స్కూ స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో నేషనల్ లా యూనివర్సిటీ-న్యూఢిల్లీ, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా-హైదరాబాద్ నిలిచాయి.

ఆర్కిటెక్చర్ విభాగంలో ఐఐటీ-రూర్కీ మొదటి స్థానంలో, ఎన్ఐటీ-కాలికట్ 2వ స్థానంలో, ఐఐటీ-ఖరగ్‌పూర్ 3వ స్థానంలో నిలిచాయి. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 18వ స్థానం దక్కించుకుంది.

ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ-కాన్పూర్ మొదటి స్థానంలో నిలవగా, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-హైదరాబాద్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 

వ్యవసాయం – అనుబంధ విభాగాల్లో న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఐసీఏఆర్ – నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-కర్నాల్, 3వ స్థానంలో పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ-లూథియానా నిలిచాయి. ఈ విభాగంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం-గుంటూరు 20వ స్థానంలో, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి 31వ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ 32వ స్థానంలో నిలించింది. తొలిసారిగా ఈ విభాగంలో ర్యాంకులను ప్రవేశపెట్టారు.

Also Read:

➥ ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 05 Jun 2023 11:41 PM (IST) Tags: NIRF Ranking 2023 NIRF college Ranking 2023 NIRF Ranking list NIRF Medical College Ranking 2023 NIRF University Ranking 2023 University Ranking in india 2023

ఇవి కూడా చూడండి

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

NIMS: 'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

NIMS: 'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

JNTUH Admissions: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సులు, అర్హతలివే

JNTUH Admissions: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సులు, అర్హతలివే

CAT 2023: క్యాట్‌-2023 పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు, గతేడాది కంటే 31 శాతం అధికం

CAT 2023: క్యాట్‌-2023 పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు, గతేడాది కంటే 31 శాతం అధికం

సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల

సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!