EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో భారీ సంఖ్యలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి జూన్ 5న ''నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS)'' నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో భారీ సంఖ్యలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి జూన్ 5న ''నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS)'' నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో దేశంలో వచ్చే మూడేళ్లలో 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 3.5లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ఈ భారీ రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా 38వేలకు పైగా కొలువుల భర్తీకి తాజా నోటిఫికేషన్ వెలువడింది.
పోస్టుల వివరాలు...
ఖాళీల సంఖ్య: 38,480
➥ ప్రిన్సిపల్: 740
➥ వైస్ ప్రిన్సిపల్: 740
➥ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 8880
➥ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 8880
➥ ఆర్ట్ టీచర్: 740
➥ మ్యూజిక్ టీచర్: 740
➥ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ): 1480
➥ లైబ్రేరియన్: 740
➥ కౌన్సెలర్: 740
➥ స్టాఫ్ నర్సు: 740
➥ హాస్టల్ వార్డెన్: 1480
➥ అకౌంటెంట్: 740
➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 740
➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 1480
➥ క్యాటరింగ్ అసిస్టెంట్: 740
➥ డ్రైవర్: 740
➥ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 740
➥ ల్యాబ్ అటెండెంట్: 740
➥ గార్డెనర్: 740
➥ కుక్: 740
➥ మెస్ హెల్పర్: 1480
➥ చౌకీదార్: 1480
➥ స్వీపర్: 2220
Also Read:
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!
ఇండియన్ ఆర్మీ జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!
పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్, గేట్/ జెస్ట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..