AP Sankranti Holidays 2023 : ఏపీ విద్యార్థులకు అలర్ట్, సంక్రాంతి సెలవులు పొడిగింపు! కొత్త తేదీలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. సంక్రాంతి సెలవులను మార్పు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జనవరి 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉండగా వాటిని మార్చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. సంక్రాంతి సెలవులను మార్పు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉండగా వాటిని మార్చేసింది. ఆ సెలవులను 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మార్పు చేశారు. ఏపీ విద్యాశాఖ తాజా నిర్ణయంతో ఏపీవ్యాప్తంగా జనవరి 19న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.
అకడమిక్ కాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. అయితే ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంక్రాంతి సెలవులు కేవలం ఆరు రోజులు మాత్రమే ఇచ్చారని, ఇవి సరిపోవని, కనీసం 18వ తేదీ వరకు సెలవులు పొడిగించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈనెల 17వ తేదీన ముక్కనుమ ఉన్నందున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు మంత్రి బొత్స సత్యనారాయణకు వినతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సెలవులు పొడిగిస్తుూ నిర్ణయం తీసుకుంది.
వీళ్లకు 8 రోజుల సెలవులు..
ఏపీలోని ఆర్టీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు జనవరి 7 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 19 నుంచి తిరిగి తెరచుకోనున్నాయి.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలో పాఠశాలలకు, కాలేజీలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. పాఠశాలలకు 5 రోజులపాటు, కాలేజీలకు 3 రోజులపాటు సెలవులు ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల సంక్రాంతి సెలవులు ఇచ్చారు.
తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, తేదీల వివరాలివే!
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు డిసెంబరు 26న ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, తేదీల వివరాలివే!
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తాజాగా విడుదల చేసింది. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని బోర్డ్ వెల్లడించింది.
ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇదే! క్వశ్చన్ పేపర్ ఇలా!
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.
పరీక్షల షెడ్యూలు, ప్రశ్నపత్రం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..