AP ECET: ఏపీఈసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీలోని ఫార్మసీ కళాశాలల్లో డిప్లొమా అర్హత ఉన్నవారికి బీఫార్మసీ ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఈసెట్ (ఫార్మసీ) కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 25న ప్రారంభమైంది.
ఏపీలోని ఫార్మసీ కళాశాలల్లో డిప్లొమా అర్హత ఉన్నవారికి బీఫార్మసీ ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఈసెట్ (ఫార్మసీ) కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 25న ప్రారంభమైంది. ఈసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబరు 25, 26 తేదీల్లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 25 నుంచి 27 వరకు ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది.
వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి సెప్టెంబరు 27న వెబ్‌ఆప్షన్లలో మార్పునకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులకు సెప్టెంబరు 28న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారికి సెప్టెంబరు 29 నుంచి 30 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈఏడాది ఈసెట్ ప్రవేశ పరీక్షకు 34,503 మంది విద్యార్థులు హాజరు కాగా.. 31,933 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
ఏపీ ఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
Pharmacy Counselling Notification
కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 25.09.2023 - 26.09.2023
➥ ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ అప్‌లోడింగ్, వెరిఫికేషన్: 25.09.2023 - 27.09.2023
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 25.09.2023 - 27.09.2023
➥ ఆప్షన్ల మార్పులకు అవకాశం: 27.09.2023
➥ సీట్ల కేటాయింపు: 28.09.2023
➥ సంబంధిత కళాశాలలో సెల్ఫ్-రిపోర్టింగ్: 29.09.2023 - 30.09.2023.
ALSO READ:
ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్ ఆప్షన్లు
ఏపీలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబరు 27 నుంచి వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పంచారు. విద్యార్థులు సెప్టెంబరు 27 నుంచి 30 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్స ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 5 నుంచి 7 వరకు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ అగ్రికల్చర్‌లో 1062 సీట్లు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 55 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్ ఎండీఎస్ కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
నీట్ ఎండీఎస్ కటాఫ్ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తగ్గించిన నేపథ్యంలో కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబరు 23న వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 24 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామన్నారు. అర్హత, ఇతర వివరాలు వెబ్‌సైట్ చూడాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
వరంగల్ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్సు, అర్హతలివే
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2023-24 విద్యాసంవత్సరానికిగాను నాలుగేళ్ల బీఎస్సీ-బీఈడీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఎస్సీ, బీఈడీ మిళితం చేసే ఇంటిగ్రేటెడ్ పాఠ్యాంశాలు కోర్సులో ఉంటాయి. అక్టోబర్‌లో కోర్సు ప్రారంభం కానుంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..