By: ABP Desam | Updated at : 03 Aug 2022 10:47 AM (IST)
ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఏపీ 2022 పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఆగస్టు 3న విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.ఈ ఏడాది జులై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
AP S.S.C EXAMINATION , JULY - 2022 RESULTS
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రెండు లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బాలురు 1,09,413 మంది, బాలికలు 82,433 మంది ఉన్నారు. ఫలితాల్లో బాలురు 60 శాతం పైగా ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 68 శాతం ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు మొత్తం 1,91,896 మంది పరీక్ష రాస్తే 1,31,233 మంది పరీక్ష ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 46.66 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022–ఏప్రిల్ రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్‌లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్ పాస్‌గానే పరిగణిస్తుంటారు.
గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు.. ఈ ఏడాది జరిగిన పరీక్షలు ప్రభుత్వానికి నిరాశను మిగిలింది. అనుకున్న దానికన్నా కూడా తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ఇక ముందు అలాంటి తప్పులను జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది.
పదోతరగతి రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 6,22,537 మంది హాజరుకాగా 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. 67.26 శాతం మాత్రమే ఉతీర్ణత నమోదైంది. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జులై 6 నుంచి 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 2,01,627ల మంది విద్యార్ధులు హాజరయ్యారు. జూన్ 6న ఫలితాలను విడుదల చేశారు. నెలరోజుల్లోపే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇది ఇలా ఉండగా, ఆంధ్రాలో ఈసారి టెన్త్ఫలితాలను గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Scholarships: ‘మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు, చివరితేది ఇదే!
JEE Advanced 2022 registration : నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్, ఇలా దరఖాస్తు చేసుకోండి!
CUET - UG 2022: రద్దయిన సీయూఈటీ-యూజీ పరీక్షలు ఎప్పుడంటే?
Scholarship for Hyderabad Student: హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్, ఏకంగా రూ.1.30కోట్ల స్కాలర్షిప్!!
videshi vidyaa deevena scheme: ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకం మార్గదర్శకాలు విడుదల
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్