News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్, ఇక ఏడు పేపర్లతో పబ్లిక్ పరీక్షల నిర్వహణ

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆగస్టు 8న ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పదోతరగతి పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులను ప్రకటించారు.

ఈసారి ఫిజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ కలిపి ఒక పేపర్‌గా- 50 మార్కులకు, బయోలజీ మరో పేపరుగా-50 మార్కులకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించనున్నారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఇస్తారు. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. అయితే ఎప్పటిలాగే మిగతా అయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కో పేపరే ఉంటుంది. 

గతనెలలోనే ఏపీ ప్రభుత్వం పదోతరగతి ప్రశ్నపత్రాల్లో మరోసారి మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది ప్రకటించిన బ్లూప్రింట్‌లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, ఒడియా, ఉర్దూ, కన్నడ, తమిళ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది. అలాగే సెకండ్‌ లాంగ్వేజ్‌ హిందీ, తెలుగు ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు చేసింది. ఇంగ్లిష్, గణితం, సోషల్‌ స్టడీస్‌ పేపర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. 

ఇంకా ఏ మార్పులు చేశారంటే?

➥ ఇప్పటి వరకు ఉన్న కాంపొజిట్ విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం 70/30 మార్కుల విధానంలో తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/ పార్శీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఫస్ట్ లాంగ్వేజ్ ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది. 

➥ అలాగే తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు కేటాయించారు. రెండో ప్రశ్నగా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులకు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.

➥ ప్రశ్నపత్రాల్లో మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వెయిటేజీతో పాటు మోడల్‌ పేపర్లనూ వెబ్‌సైట్‌లో పెట్టింది. అయితే సైన్స్‌ ప్రశ్నపత్రం నమూనా కూడా త్వరలోనే వెబ్‌సైట్‌లో పెడతామని పేర్కొంది. 

ప్రశ్నపత్రాల బ్లూప్రింట్స్ కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

APPSC: ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
https://telugu.abplive.com/education/appsc-has-released-rimc-july-2024-term-entrance-exam-notification-check-details-here-108706

నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 09 Aug 2023 09:42 AM (IST) Tags: AP SSC exams Education News in Telugu Botsa Satyanarayana AP Tenth Public Exams AP SSC Exams Blue Print AP SSC Exams Model Papers

ఇవి కూడా చూడండి

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

TS EAMCET: ఎంసెట్‌ బైపీసీ స్పాట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?

TS EAMCET: ఎంసెట్‌ బైపీసీ స్పాట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?

TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 రిపోర్టింగ్‌ గడువు పెంపు, ఎప్పటివరకంటే?

TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 రిపోర్టింగ్‌ గడువు పెంపు, ఎప్పటివరకంటే?

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ