AP SSC Exam Time Table: ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
SSC Exams: ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదలైంది. గురువారం (డిసెంబరు 14) మధ్యాహ్నాం విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు.
![AP SSC Exam Time Table: ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే? andhra pradesh class 10 exam schedule released check complete details here AP SSC Exam Time Table: ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/15/d75cdeef18af39062c804a5c609b5c841702582563598522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Tenth Exams Time Table: ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదలైంది. గురువారం (డిసెంబరు 14) మధ్యాహ్నాం విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో సాధారణ ఎన్నికలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి నెలలోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 31 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గం. వరకు పదోతరగతి పరీక్షలు నిర్ణయించారు. ఈసారి పదోతరగతి విద్యార్థులకు 7 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులందరూ పరీక్షల్లో పాసై 100 శాతం సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నట్లు మంత్రి బొత్స అన్నారు.
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదోతరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు..
➥ మార్చి 18: ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
➥ మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్
➥ మార్చి 20: ఇంగ్లీష్
➥ మార్చి 22: తేదీ మ్యాథమెటిక్స్
➥ మార్చి 23: ఫిజికల్ సైన్స్
➥ మార్చి 26: బయాలజీ
➥ మార్చి 27: సోషల్ స్టడీస్ పరీక్షలు
➥ మార్చి 28: మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
➥ మార్చి 30: ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష
'పది' వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు..
ఏపీలోని పదోతరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. విద్యార్థుల పేర్లు, ఇతరత్రా వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. విద్యార్థులు డిసెంబరు 16 నుంచి 20 వరకు వివరాలు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు.. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. బోర్డుకు సమర్పించిన విద్యార్థుల దరఖాస్తుల్లో వివరాలు తప్పుగా ఉంటే సరి చేయాలని సూచించారు. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మాధ్యమం, ఫొటో, సంతకం, మొదటి, రెండో భాష సబ్జెక్టు వివరాలను పరిశీలించాలని ఆయన తెలిపారు.
టెన్త్ మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ డిసెంబరు 14న ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం 2024 మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదోతరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు.
ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ- 2024) 10వ తరగతి & 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 02 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం ఉదయం 10:30 నుంచి మొదలవుతాయని తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్లను రూపొందించారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)