అన్వేషించండి

ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

Inter Exams: ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ డిసెంబరు 14న ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు.

AP Inter Exams 2024: ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ డిసెంబరు 14న ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం 2024 మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదోతరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 2 నుంచి ఏప్రిల్ 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈసారి దాదాపు   10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. 

ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

➥ మార్చి 1- శుక్రవారం -  సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

➥ మార్చి 4 - సోమవారం - ఇంగ్లిష్ పేపర్-1

➥ మార్చి 6 - బుధవారం - మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.

➥ మార్చి 9 - శనివారం - మ్యాథ్స్ పేపర్‌-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

➥ మార్చి 12 - మంగళవారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1

➥ మార్చి 14 - గురువారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1

➥ మార్చి 16 - శనివారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).

➥ మార్చి 19 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

➥ మార్చి 2 - శనివారం - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2

➥ మార్చి 5 - మంగళవారం - ఇంగ్లిష్‌ పేపర్-2

➥ మార్చి 7 - గురువారం - మ్యాథ్స్‌ పేపర్‌-2ఎ, బోటనీ, సివిక్స్-2.

➥ మార్చి 11 -  సోమవారం - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2.

➥ మార్చి 13 - బుధవారం - ఫిజిక్స్ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.

➥ మార్చి 15 - శుక్రవారం - కెవిుస్ట్రీ పేపర్‌-2, కామర్స్ పేపర్‌-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2

➥ మార్చి 18 - సోమవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).

➥ మార్చి 20  - బుధవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

ALSO READ:

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ- 2024) 10వ తరగతి & 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 02 వరకు నిర్వహిస్తారు.  ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం ఉదయం 10:30 నుంచి మొదలవుతాయని తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్లను రూపొందించారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Viral Video : కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
Mahindra Thar: థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP DesamUsha Chilukuri vs Kamala Harris |  Donald Trump విక్టరీతో US Elections లో తెలుగమ్మాయిదే విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Viral Video : కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
Mahindra Thar: థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
Samantha: బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో చిచ్చు రేపిన ప్లకార్డు - కొట్టుకున్న ఎమ్మెల్యేలు
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో చిచ్చు రేపిన ప్లకార్డు - కొట్టుకున్న ఎమ్మెల్యేలు
Thug Life Release Date: కమల్ హాసన్ బర్త్ డే గిఫ్ట్... ‘థగ్‌ లైఫ్‌’ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్
కమల్ హాసన్ బర్త్ డే గిఫ్ట్... ‘థగ్‌ లైఫ్‌’ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్
Nayanthara : బ్లాక్​ అండ్ వైట్​ లుక్​లో నయనతార ఫోటోషూట్.. మెస్సీ హెయిర్​తో సూపర్​ హాట్​గా ఉన్న హీరోయిన్​
బ్లాక్​ అండ్ వైట్​ లుక్​లో నయనతార ఫోటోషూట్.. మెస్సీ హెయిర్​తో సూపర్​ హాట్​గా ఉన్న హీరోయిన్​
Embed widget