అన్వేషించండి

Jagananna Videshi Vidya Deevena : విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, జగనన్న విదేశీ విద్యాదీవెనపై కీలక ఉత్తర్వులు

Jagananna Videshi Vidya Deevena :విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.

Jagananna Videshi Vidya Deevena : ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో వరం ప్రకిటంచింది. విదేశీ విద్య కోసం మరో పథకాన్ని అమ‌లులోకి తీసుకువ‌స్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జ‌గనన్న విదేశీ విద్యాదీవెనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పక్షపాతం లేకుండా ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వం చెల్లించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 100పై బడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయనుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించనుంది. 

చెల్లింపు ఇలా 

ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫస్ట్‌ సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు, రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు ఉంటాయ‌ని స్పష్టం చేసింది. నాలుగో సెమిస్టర్‌ లేదా ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంత వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు ఉంటుంద‌ని వెల్లడించింది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది.

అర్హతలు 

జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో స్థానికుడై ఉండాలి, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంద‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్‌ ఇస్తారు. సీఎస్ నేతృత్వంలో కమిటీ ఎంపిక చేయాల‌ని నిర్ణయం తీసుకున్నారు. 2016-17 నుంచి లబ్దిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్లను బకాయిలుగా ఉన్నాయని  ప్రభుత్వం తెలిపింది. టీడీపీ ప్రభుత్వ సమయంలో ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలకు వర్తింపచేయలేదని వెల్లడించింది. ఇప్పుడు అగ్రకులాల్లోని పేదలకు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వంలో సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి వర్తింపు, ఇప్పుడు ఆదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉన్నవారికీ వర్తింపు చేయనున్నారు. ప్రపంచంలోని ఎక్కడైనా 200 అత్యుత్తమ యూనివర్శిటీలకు వర్తింపు చేస్తున్నారు.  టాప్‌ 100 యూనివర్శిటీల్లో సీటు వస్తే పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నారు. 101 నుంచి 200 లోపు ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షలు వరకూ ఫీజులను చెల్లించనున్నారు. టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎంతమంది సీట్లు సాధించినా వర్తింపు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget