అన్వేషించండి

NEET UG 2024: నేడే నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష, తెలుగు రాష్ట్రాల నుంచి హాజరుకానున్న 1.5 లక్షల విద్యార్థులు

NEET UG: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యూజీ - 2024 పరీక్షను మే 5న నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరుగనుంది.

NEET UG 2024: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్దేశించిన నీట్ యూజీ - 2024 ప్రవేశ పరీక్ష నేడు (మే 5న) నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరుగనుంది. పెన్ను, పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. తెలుగుతో పాటు 13 బాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది నీట్ పరీక్ష కోసం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 70 వేల మంది, తెలంగాణ నుంచి 80 వేల మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా  23 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఏపీలో 29 జిల్లా కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటుచేశారు.

నీట్ యూజీ పరీక్షలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రియల్ టైం అనలిటికల్ టూల్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది విద్యార్థులు ఏవైనా తప్పిదాలకు పాల్పడితే వెంటనే గుర్తిస్తుంది. నీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ కళాశాలల్లో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే నీట్ అడ్మిట్ కార్డులను వెల్లడించిన సంగతి తెలిసిందే. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతోపాటు, ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును, ఫోటోలను తీసుకొని పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రానికి కనీసంగంటన్నర ముందు చేరుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అడ్మిట్‌కార్డుపై ఉన్న నిబంధనలను స్పష్టంగా చదవాలి. ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించేవి, అనుమతించనవి ఏవో ఉంటాయి. ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలో సూచనలు కూడా ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ అన్నింటినీ అభ్యర్థులు పూర్తిగా చదివి అందుకు అనుగుణంగా అన్నీ సిద్ధం చేసుకొని పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
NEET (UG) - 2024 Admit Cards

నీట్ అభ్యర్థులకు విద్యార్థులకు ముఖ్య సూచనలు..

🔰 నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి. ఫొటోను అటెండెన్స్‌ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది.

🔰  చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి కూడా ధరించకూడదు.

🔰 అభ్యర్థులు డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోనికి అనుమతించరు.

🔰 స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్‌ మాత్రమే వేసుకోవాలి.

🔰 పేపర్లు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్సులు, ప్లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్స్‌, ఎలక్ట్రానిక్‌ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుమతించరు.

నీట్ యూజీ  2024 పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.

➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.

➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.

➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

NEET UG Notification: నీట్‌ యూజీ - 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!

Information Broucher

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Embed widget