అన్వేషించండి

Mallik Tej: యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు

Hyderabad News: మరో యూట్యూబర్‌పై అత్యాచార కేసు నమోదైంది. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై కేసు నమోదైంది.

Case Filed On Youtuber Malliktej: ఇటీవల సోషల్ మీడియా సెలబ్రిటీలపై లైంగిక ఆరోపణలు, అత్యాచార అభియోగాలు ఎక్కువవుతున్నాయి. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు మరువక ముందే మరో యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఓ యువతి ఫిర్యాదు మేరకు యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై జగిత్యాల (Jagitial) పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అతని యూట్యూబ్ ఛానల్స్‌లో ఫోక్ సాంగ్ చేసే ఓ యువతి తనపై అత్యాచారం చేశాడని.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. తనతో పాటు కుటుంబ సభ్యులను దూషిస్తున్నాడని చెప్పగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లిక్ తేజ్ రైటర్ కమ్ సింగర్. అంతే కాకుండా జగిత్యాల జిల్లా సాంస్కృతిక సారధిలో ఉద్యోగిగా ఉన్నారు. కాగా, బాధితురాలు, మల్లిక్ తేజ్ చాలా ఫోక్ సాంగ్స్ చేసి గుర్తింపు పొందడమే కాకుండా గతంలో పలు టీవీషోల్లో సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

కాగా, ఇటీవలే యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని.. నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేశాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఓ ప్రైవేట్ పార్టీలో కలిసి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని.. పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి పేర్కొంది. విశాఖకు చెందిన హర్షసాయి పేదలకు ఆర్థిక సాయం చేస్తూ వీడియోలను తన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ పాపులర్ అయ్యాడు. మరోవైపు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పైనా ఓ లేడీ కొరియోగ్రాఫర్ తనను వేధించారని ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కేసులు నమోదు కాగా.. పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.

Also Read: Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget