అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు

Andhra News: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాయి. విశాఖలో సైబర్ నిందితులను సీబీఐ అరెస్ట్ చేయగా.. తెలంగాణలో ఒకే ఖాతాలో రూ.124 కోట్లు బదిలీ కావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Cyber Criminals Arrested By CBI In Visakha: విశాఖలో (Visakha) ఐదుగురు సైబర్ నిందితులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో సైబర్ నేరాల (Cyber Crime) కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. నగరంలో నివాసం ఉంటున్న అక్షయపత్వాల్, ధీరజ్ జోషి, హిమాన్షుశర్మ, పార్త్‌బాలి, పి.నవీన్ చంద్ర పటేల్ స్థానిక బిర్లా జంక్షన్ వద్ద ఓ కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారు. వీరు గత కొంతకాలంగా ఆన్ లైన్‌లో మోసాలకు పాల్పడుతూ.. పలువురి నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ, ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి ల్యాప్ టాప్స్, హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం సీబీఐ వారి కస్టడీలోకి తీసుకుంది. అటు, నగరంలోని పలు కాల్ సెంటర్లనూ తనిఖీ చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఒకే ఖాతాలో రూ.124 కోట్లు

మరోవైపు, తెలంగాణలో ఒకే ఖాతాలో రూ.124 కోట్లు బదిలీ కావడం కలకలం రేపింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన రూ.కోట్ల సొమ్మును హైదరాబాద్‌లోని పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయించుకున్న కేసుకు సంబంధించి దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. నగరంలో శంశీర్‌గంజ్ ఎస్బీఐ శాఖలోని 6 కరెంట్ ఖాతాల్లోకి సైబర్ నేరాల సొమ్ము బదిలీ కావడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరింటిలోని ఒకే బ్యాంకు ఖాతాలోకి ఏకంగా రూ.124.25 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించారు. 'ప్రొవెన్ ఏహెచ్ఎం ఫ్యుజన్' సంస్థ పేరిట ఉన్న ఈ ఖాతాల్లోకి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సొమ్ము జమ అయింది. ఇది మహ్మద్ బిన్ అహ్మద్ బవజీర్ పేరిట ఉన్నట్లు తేలింది. ఇతడి పేరిటే ఉన్న మరో ఖాతాలోకి రూ.34.19 లక్షలు వచ్చినట్లు వెల్లడి కాగా అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. ఈ క్రమంలోనే అతను కమీషన్ కోసం బ్యాంక్ ఖాతాను సమకూర్చాడని (మ్యూల్) తేలింది. దుబాయ్‌లో ఉన్న సూత్రధారి సూచన మేరకే తాను బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు నిందితుడు వెల్లడించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. బ్యాంక్ ఖాతాలోకి వచ్చిన సొమ్మును హవాలా మార్గంతో పాటు ఫారిన్ ఎక్స్ఛేంజీల ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. 

అటు, మిగిలిన 5 ఖాతాలూ మ్యూల్స్‌వే అని తేలింది. ఈ క్రమంలో అసలు సూత్రధారి దొరికితేనే కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఖాతాలోకి చేరిన రూ.124.25 కోట్ల నగదు 234 నేరాలకు సంబంధించిందిగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సాధారణంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)కు వచ్చే ఫిర్యాదుల్ని టీజీసీఎస్‌బీ పోలీసులు విశ్లేషిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే శంశీర్ గంజ్ ఎస్బీఐ ఖాతాలో భారీగా సైబర్ నేరాల సొమ్ము బదిలీ కావడంపై వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 2 నెలల్లోనే 6 కరెంట్ ఖాతాల్లోకి సుమారు రూ.150 కోట్ల వరకూ లావాదేవీలు జరగడంతో ముమ్మర విచారణ చేయగా అసలు విషయం వెలుగుచూసింది.

Also Read: Telangana BJP : నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
Embed widget