Telangana News: ఆర్టీసీ బస్సులో కండక్టర్ అసభ్య ప్రవర్తన - ట్విట్టర్ ద్వారా యువతి ఫిర్యాదు, విచారణకు ఆదేశించిన ఎండీ సజ్జనార్
TGSRTC: ఆర్టీసీ బస్సులో కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ట్విట్టర్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సంస్థ ఎండీ సజ్జనార్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
Young Woman Complaint Against RTC Bus Conductor: ఆర్టీసీ బస్ కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన సంస్థ ఎండీ సజ్జనార్ (Sajjanar) ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన యువతి బస్సులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌లో అధికారుల దృష్టికి తెచ్చారు. 'ఈ నెల 15న మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్నా. నా దగ్గర ఆధార్ కార్డు లేకపోవడంతో డబ్బులిచ్చి టికెట్ కావాలని అడిగా. అయితే, కండక్టర్ ఒక్కసారిగా నావైపు దూసుకొచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో నేను గట్టిగా అరిచాను. సదరు కండక్టర్ వెనక్కి వెళ్లిపోయాడు. అతనిపై చర్యలు తీసుకోవాలి.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
విచారణకు ఆదేశం
ఫరుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా #TGSRTC యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ… pic.twitter.com/pCzfcZRUz4
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 16, 2024
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 'ఫరూఖ్‌నగర్ డిపోనకు చెందిన ఓ కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఓ యువతి సోషల్ మీడియా ద్వారా ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు సంస్థ తీసుకుంటుంది. టీజీఎస్‌ఆర్టీసీ మహిళల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. ప్రతి రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.' అని ట్వీట్ చేశారు.