అన్వేషించండి

Rajanna Sircilla News: గర్భవతిని చేసి మరొకరితో పెళ్లికి రెడీ, ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన యువతి

Telangana News: తనను ప్రేమించి పెళ్లి చేసుకుని, వదిలేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. తనను గర్భవతిని చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది.

Rajanna Sircilla News : ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. తనను గర్భవతిని చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనను గర్భవతిని చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆందోళన చేస్తూ ఓ యువతి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. దీంతో ఆ యువకుడి బంధువులు ఆ యువతిని చితకబాదారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. సుల్తానాబాద్‌కు చెందిన ఆ యువతి.. ఐదేళ్లుగా తమ మధ్య ప్రేమ నడిచిందని చెబుతోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. యువతిని స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు.

మరో పెళ్లికి రెడీ
సుద్ధాల గ్రామానికి చెందిన ఓ యువకుడు, మరో గ్రామానికి చెందిన యువతి గత ఐదేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా వీరు రహస్యంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు.. కానీ సీన్ కట్ చేస్తే కట్టుకున్న భార్యను వదిలేసి మరొక వివాహానికి సిద్ధమయ్యాడు. ప్రియుడు మరో పెళ్లికి రెడీకావడంతో అతడి ఇంటి ముందు యువతి ధర్నాకు దిగింది. దీంతో ధర్నా చేస్తున్న యువతిపై యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి ఒడిగట్టారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

పెళ్లి చేసుకున్నాడు.. ముఖం చాటేశాడు
ఈ సందర్భంగా యువతి మీడియాతో మాట్లాడుతూ.. తనే ప్రేమిస్తున్నానని నా వెంటపడ్డాడు. వచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాడు. కాళ్లు పట్టుకుని ప్రేమించమని బతిమిలాడాడు. దీంతో ప్రేమించాను. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. మా ఇంట్లో విషయం చెప్పి పెళ్లి చేసుకున్నాం. వాళ్ల ఇంట్లో చెప్పమంటే అతడి నాన్నకు మెసేజ్ చేశాడు. మా విషయం మొత్తం వాళ్ల అత్తమ్మకు తెలుసు. పెళ్లికి కావాల్సిన షాపింగ్ ఆమెతోనే చేశాము. ఒక రోజు ఉన్నట్లుండి వాళ్ల నాన్న ఫోన్ చేశాడని వెళ్లాడు. మూడు రోజులు ఫోన్ లో టచ్ లో ఉన్నాడు. అకస్మాత్తుగా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఇలా ఆందోళనకు దిగాల్సి వచ్చింది.’ అంటూ చెప్పుకొచ్చింది.  ఇప్పుడు తన పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కంటతడిపెట్టుకుంది. బాధితురాలు చేపట్టిన న్యాయ పోరాటానికి  మహిళ  సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని యువతిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇద్దరు ప్రేమ పెళ్లి కనుక చేసుకుని ఉంటే ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పుకొచ్చారు. 

దుబ్బాకలో సేమ్ టు సేమ్
తనను ప్రేమించి వాడుకుని వదిలేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. గత నెలలో సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన పల్లె కవిత, పల్లె శ్రీకాంత్ గత ఎనిమిదేళ్లుగా ఇరు కుటుంబాలకు తెలియకుండా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు ఇటీవల ప్రియుడితో పెళ్లి ప్రస్తావన తీసుకరావడంతో ముఖం చాటేయడమే కాకుండా, అమ్మాయి ఎవరో తనకు తెలియదని, తనతో ఎటువంటి సంబంధం లేదని ప్రియుడు చెప్పడంతో ప్రియురాలు కుటుంబ సభ్యులతో ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. దీంతో అక్కడ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి శ్రీకాంత్ ను దుబ్బాక పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget