Hyderabad Crime News: డిజిటల్ అరెస్ట్ అని బెదిరించి మహిళా ప్రొఫెసర్ నుంచి 1.6 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
Digital Arrest Case in Hyderabad | డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి మహిళా ప్రొఫెసర్ వద్ద నుంచి కోటిన్నరూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. మేడ్చల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్: డిజిటల్ అరెస్టు పేరుతో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. నీ మీద డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి, చీటింగ్ కేసులన్నాయి. ఈడీ, సీబీఐ కేసు నమోదయింది అంటూ ఏదో ఒక సాకు చెప్పి సైబర్ నేరగాళ్లు లక్షల నుంచి కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. ఓ మహిళా ప్రొఫెసర్ ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఆమె వద్ద నుంచి ఏకంగా కోటి 60 లక్షల రూపాయలు కొట్టేశారు. హైదరాబాదులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అసలు ఏం జరిగిందంటే..
మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ మహిళ ప్రొఫెసర్ కు ఇటీవల వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. తాము ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులమని పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. మనీలాండరింగ్ అభియోగాలతో నీమీద కేసు నమోదయింది అని చెప్పారు. తనకు అలాంటి వాటితో సంబంధం లేదని చెప్పినా వాళ్లు వినలేదు. ఈడీ కేసులో అనుమానితుల జాబితాలో మీ పేరు ఉంది, సిబిఐ అధికారులు మీకు ఫోన్ చేస్తారని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత మరో వ్యక్తి మహిళా ప్రొఫెసర్ కు కాల్ చేసి, తను సీబీఐ అధికారిని పరిచయం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ మనీలాండరింగ్ లో ఈడీ కేసులో అనుమానితుల జాబితాలో మీ పేరు ఉందని త్వరలో పాస్‌పోర్టు రద్దు చేస్తాం. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదని రిటైర్డ్ మహిళా ప్రొఫెసర్ ను తను బెదిరించాడు.
బ్యాంకు వివరాలు, ఆధార్, పాన్ కార్డు వివరాలు ఇస్తే లావాదేవీలు చెక్ చేసి.. సంబంధం లేదని తేలితే కేసు నుంచి పేరు కలిగిస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మిన రిటైర్డ్ ప్రొఫెసర్ అన్ని వివరాలు ఇచ్చారు. తనకు కోటి రూపాయలు ఇస్తే పునర్తాధికారులతో మాట్లాడి ఎఫ్ఐఆర్ నుంచి ఆమె పేరు తొలగిస్తామని, లేకపోతే పాస్పోర్టు రద్దు అవుతుంది. అరెస్టు తప్పదని బెదిరించారు. తన బ్యాంకు ఖాతాలో ఉన్న కోటి రూపాయలను సైబర్ నేరగాడు చెప్పిన అకౌంట్ కు బదిలీ చేశారు. వరుస ఫోన్లో రావడంతో ఆమె ఇతరుల వద్ద 60 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని నెలరోజుల వ్యవధిలో ముట్టజెప్పారు.
ఇంత చేసినా తనమీద చేసుకొట్టి వేశారో లేదో.. వాళ్లు నిజంగా అధికారులేనా.. తాను మోసపోయానని గ్రహించి ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మనీ లాండరింగ్ కేసు నమోదయిందని బెదిరించి తన వద్ద నుంచి ఒక కోటి 60 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. సిబిఐ డబ్బు డిమాండ్ చేసిందని బయట ఎవరికి చెప్పకూడదని, లేకపోతే యేసు తీవ్రత పెరుగుతుందని బెదిరించినట్లు రిటైర్డ్ మహిళా ప్రొఫెసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.






















