Crime News: అస్సాంలో దారుణం - మహిళపై సామూహిక అత్యాచారం వీడియో వైరల్, 8 మంది నిందితుల అరెస్ట్
Assam Crime: అస్సాంలో దారుణం జరిగింది. ఓ మహిళపై గత నవంబరులో సామూహిక అత్యాచారం చేసిన నిందితులు ఆ దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Woman Abused Vidoe Gone Viral In Assam: దేశంలో మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, అస్సాంలో (Assam) దారుణం జరిగింది. ఓ యువతిపై గత నెలలో సామూహిక అత్యాచారం జరగ్గా.. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి కారణమైన 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం గువాహటీలోని ఓ ఆలయం పరిసరాల్లో నవంబర్ 17న ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన నిందితులు వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇవి వైరల్‌గా మారడంతో యువతిపై అత్యాచారానికి పాల్పడిన 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
అయితే, బాధితురాలు ఎవరనేది తెలియాల్సి ఉంది. నిందితులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వారేనని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యొద్దని పోలీసులు తెలిపారు.