West Godavari: వీళ్ల తెలివి సల్లగుండా... లారీలో సీక్రెట్ గా ఖాకీలకు చిక్కకుండా...
ప్రభుత్వం ఎంత పటిష్ట చర్యలు చేపట్టిన గంజాయి రవాణాకు అడ్డుకట్టపడడంలేదు. విశాఖ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 144 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి రవాణాకు కేటుగాళ్లు రోజురోజుకీ కొత్త పద్దతులు వెదుకుతున్నారు. విశాఖ నుంచి తమిళనాడుకి సీక్రెట్ గా లారీలో తరలిస్తున్న 144 కేజీల గంజాయిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. లారీలో సీక్రెట్ క్యాబిన్ ఏర్పాటుచేసి 144 కేజీల గంజాయిని రవాణా చేస్తున్నారు. ఏలూరు డీఎస్పీవో దిలీప్ కిరణ్ ఆదేశాలతో చేబ్రోలు ఎస్‌ఐ కె.స్వామి ఆధ్వర్యంలో చేబ్రోలు రైల్వే గేటు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో TN 31 AA 6765 నెంబర్ గల లారీలో గంజాయి పట్టుకున్నారు. లారీలో ఒక సీక్రెట్ ఛాంబర్ ఏర్పాటు చేసి అందులో సుమారుగా 144 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశారు. ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితులు గంజాయిని విశాఖపట్నం నుంచి తమిళనాడు కోయంబత్తూర్ కు తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తెలింది. ఈ గంజాయి విలువ రూ.8,64,000 అని పోలీసులు వెల్లడించారు.
Also Read: అక్కాచెల్లెళ్లపై ఐదేళ్లుగా అత్యాచారం.. మాస్టర్ ప్లాన్ వేసిన భూత వైద్యుడు, అతని కొడుకుతో కూడా..
విశాఖ టు కొయ్యంబత్తూరు
అనపర్తి రమణ అనే వ్యక్తి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఈ గంజాయి కొనుగోలు చేసి పిఠాపురానికి చెందిన పాలూరు నాగు, కింతాడ ఎల్లేశ్వరరావు ద్వారా కొయ్యంబత్తూరుకు చెందిన ప్రేమ్ కుమార్, దామోదరన్ కు అమ్ముతుంటాడని పోలీసుల విచారణలో తేలింది. గంజాయిని పట్టుకున్న చేబ్రోలు ఎస్‌ఐ స్వామి, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
Also Read: యువతిపై ఫేస్‌బుక్ ఫ్రెండ్ దారుణం.. కదులుతున్న కారులో అత్యాచారం.. ఆపై దారుణమైన స్థితిలో..!
గంజాయి రవాణాను అడ్డుకునేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి వాహన తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. వాహనాలు, అనుమానిత ప్రదేశాలను తనిఖీలు చేస్తున్నామన్నారు. గంజాయి రహిత సమాజం కోసం పరివర్తన కార్యక్రమం చేపట్టామని అందులో భాగంగా ఇప్పటి వరకూ 41 గంజాయి కేసులలో 129 మందిని అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి 13,058 కేజీల గంజాయి, 38 వాహనాలు సీజ్ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు.
Also Read: చాక్లెట్ ఇస్తానని బాలుడ్ని రమ్మన్న యువకుడు.. పొదల్లోకి తీసుకెళ్లి పాడుపని, భయంతో పరుగులు