అన్వేషించండి

West Godavari Crime : ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే మోసం చేశాడని, ఈగల మందు తాగి యువతి ఆత్మహత్య!

West Godavari Crime : ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతి ఈగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్యపై అనుమానాలున్నాయని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

West Godavari Crime : ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ జంట ప్రయాణం కొంత కాలం బాగానే సాగింది. అనంతరం వారి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆ యువతి ఈగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్‌కు అదే గ్రామానికి చెందిన దేవికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు నెలల పాప కూడా ఉంది. కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం సతీష్‌ పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సతీష్, దేవి మధ్య మరోసారి గొడవ జరిగింది. అనంతరం సతీష్‌ తిరిగి పనికి వెళ్లిపోయాడు.

ఈగల మందు తాగి ఆత్మహత్య 

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దేవి ఇంట్లో ఉన్న ఈగలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న దేవిని గమనించిన అత్త నిర్మల గమనించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై దేవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవి, సతీష్‌లది ప్రేమ వివాహం అని, అయితే సతీష్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఇటీవల దేవి కుటుంబ సభ్యులు సతీష్ ను అడిగితే, దేవిని కొట్టాడని దీంతో మనస్తాపం చెంది ఈగల మందు తాగిందని ఫిర్యాదులో  తెలిపారు. అయితే సతీష్‌ బలవంతంగా తన చెల్లితో ఈగల మందు తాగించాడనే అనుమానం కూడా ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ప్రేమ పేరిట మోసం, రూ.12.45 లక్షలు స్వాహా

ప్రేమ సమస్య నుంచి బయటపడేందుకు ఓ మహిళా వైద్యురాలు మాంత్రికుడి సాయం తీసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే గూగుల్ లో స్వామీజీ కోసం వెతికింది. కానీ దురదృష్టవశాత్తు నైజీరియన్ల వలకు చిక్కింది. దాదాపు 12.45 లక్షల రూపాయలు మోసపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. ఇద్దరు నిందితులు చిక్కారు. మరో ఇద్దరు తప్పించుకొని పారిపోయారు.

అసలేం జరిగిందంటే..?

 నైజీరియాకు చెందిన 41 ఏళ్ల ఒక్వుచుక్వు, 35 ఏళ్ల జోనాథన్, మైఖేల్ అజుండా, డేనియల్, వస్త్రాల వ్యాపార నిమిత్తం కొన్నేళ్ల క్రితం భారత్ కు వచ్చి నష్టపోయారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు దిల్లీ కేంద్రంగా మోసాలు చేయడం ప్రారంభించారు. ఏ సమస్యకు అయినా పరిష్కారం చూపిస్తామంటూ ఇంటర్ నెట్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఫోన్ నంబర్లు ఉంచారు. సంప్రదించిన వారిని మాయ మాటలతో నమ్మించి డబ్బు లాగుతున్నారు. కుషాయిగూడకు చెందిన కంటి వైద్యురాలు తన ప్రేమ వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలు, వృత్తిపరంగా విజయం సాధించేందుకు సలహాలు, పరిష్కారం కోసం గూగుల్ లో వెతికారు. అక్కడే ఆమెకు ఓ ఫోన్ నెంబర్ కనిపించింది. దీంతో వెంటనే ఆ మహిళా వైద్యురాలు ఆ నంబర్ కు ఫోన్ చేసింది. అయితే ఉగండాకు చెందిన వ్యక్తితో ప్రార్థనలు చేయించి సమస్య పరిష్కరిస్తామంటూ మభ్యపెట్టారు. రూ.12.45 లక్షలు వసూలు చేశారు. మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా... ఒక్వుచుక్వు, ఉజకలను దిల్లీలో అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పారిపోయారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget