News
News
X

Warangal Crime: వరంగల్ కమిషనరేట్ పరిధిలో 348 వాహనాలు సీజ్ - యజమానులపై కేసులు నమోదు, ఎందుకంటే !

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 348 వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహన యజమానులపై చీటింగ్ కేసులను నమోదు చేసినట్లుగా వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ వెల్లడించారు. 

FOLLOW US: 
Share:

వరంగల్ : రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించడం చట్ట ప్రకారం నేరం. కానీ కొందరు కేటుగాళ్లను చూసి సాధారణ పౌరులు సైతం నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలపై తమ ఇష్టం వచ్చినట్లుగా సంచరిస్తున్నారు. దీనిపై వరంగల్ పోలీసులు ఫోకస్ చేశారు. దాంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తూన్న 348 వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహన యజమానులపై చీటింగ్ కేసులను నమోదు చేసినట్లుగా వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ వెల్లడించారు. 
కొత్త సీపీ వచ్చాక ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు
వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవి రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రై సిటీ పరిధితో పాటు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై ఫోకస్ చేశారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్, మోటారు వాహనాల చట్టం అతిక్రమిస్తున్నారో, అలాంటి వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ లేనివి, మార్ఫింగ్ చేసినవి, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, నంబర్ ప్లేట్లకు మాస్కులు పెట్టిన వాహనాలను గుర్తించి వాహన యజమానులపై ఛీటింగ్ నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు గత నెల మొదటి తేదీ నుంచి ఇప్పటివరకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా రోజువారి తనీఖీలు నిర్వహించారు. 
వాహన యజమానులపై కేసులు నమోదు
ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 348 వాహనాలు సీజ్ చేయగా ఇందులో కార్లు 4, ఆటో ఒకటి, ద్విచక్ర వాహనాలు 343, ఈ సీజ్ చేసిన వాహనాల్లో వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 93, హనుమకొంలో 126, కాజీపేటలో 72 వాహనాలు ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించినట్లు తెలిపారు. అప్పగించిన వాహన యజమానులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులను నమోదు చేశామని ట్రాఫిక్ ఏసిపి వెల్లడించారు. ఈ కార్యక్రమములో వరంగల్, కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు ఈ బాబులాల్, రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్ ఎస్.ఐలు రాజబాబు, డేవిడ్, మీల్స్ కాలనీ ఎస్.ఐ సాంబయ్య పాల్గొన్నారు.

లౌడ్ స్పీకర్లు, బ్యాండ్ ఉపయోగిస్తే చర్యలు తప్పవు
-వరంగల్ పోలీస్ కమిషనర్ పి.వి. రంగనాథ్
వరంగల్ : సమయ పాలన పాటించకుండా లౌడ్ స్పీకర్లు, వాయిద్యాలు (బ్యాండ్) ఉపయోగిస్తే వారిపై చట్ట పరమైనచర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు సమయ పాలన పాటించకుండా లౌడ్ స్పీకర్లు వినియోగిస్తుడంపై పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తుందడంతో దీనిపై వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాలతో పాటు విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ కమీషనర్ సమయపాలన పాటించని లౌడ్ స్పీకర్లు వినియోగంపై దృష్టి సారించారు. 
వ్యక్తులు, సంస్థలుగాని లౌడ్ స్పీకర్లును ఉ దయం ఆరు గంటల ముందుగాని రాత్రి పది గంటల తరువాత గాని లౌడ్ స్పీకర్లు ను వినియోగించరాదని, ముఖ్యంగా ఇంటిలో జరిగే శుభకార్యాలతో పాటు ఇతర సందర్భాల్లో రాత్రి సమయంలో డి.జె.లు, వాయిద్యాలు(బ్యాండ్), క్రాకర్లను కాల్చిశబ్ద కాలుష్యంతో పాటు వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, విధ్యార్థులు, సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని.. ఇకపై ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని, అలాగే ఏవారైనా రాత్రి సమయాల్లో డి.జె నిర్వహిస్తున్న అధిక శబ్దాలతో వాయిద్యాలు( బ్యాండ్ ) మ్రోగించిన, క్రాకర్లు కాల్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే డయల్ 100 నంబర్ కు ఫోన్ సమాచారం అందించడం ద్వారా స్థానిక పోలీసులు వారిపై తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ సదరు అధికారి వారిపై చర్య తీసుకుని ఎదల వరంగల్ పోలీస్ కమిషనర్ నంబర్ 8712685100 కు సంక్షిప్త సమాచారంతో మెసేజ్ చేయవలసిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.

Published at : 13 Feb 2023 03:43 PM (IST) Tags: Crime News vehicle seize Warangal Warangal Police Warangal Police Commissionerate

సంబంధిత కథనాలు

Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!

Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!

Guntur Crime News: మాకు చెప్పకుండా జనాల్ని తీసుకెళ్తారా ? వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన కానిస్టేబుల్!

Guntur Crime News: మాకు చెప్పకుండా జనాల్ని తీసుకెళ్తారా ? వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన కానిస్టేబుల్!

Social Media posts Arrests : రాజకీయ నేతల్ని అసభ్యంగా ట్రోల్ చేస్తే జైలే - మీమర్స్‌కు షాకిచ్చిన సైబర్ క్రైమ్స్ పోలీసులు !

Social Media posts Arrests :  రాజకీయ నేతల్ని అసభ్యంగా ట్రోల్ చేస్తే జైలే - మీమర్స్‌కు షాకిచ్చిన సైబర్ క్రైమ్స్ పోలీసులు !

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

Mulugu News: నీళ్లు తాగిన వెంటనే 24 మంది కూలీలకు అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం

Mulugu News: నీళ్లు తాగిన వెంటనే 24 మంది కూలీలకు అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!