Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!
Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేశాడో తమ్ముడు. అన్న ఊర్లో లేనిసమయంలో అతని ఇంట్లో చోరీ చేశాడు.
Warangal Crime : స్వయాన అన్న ఇంటిలోనే చోరీకి పాల్పడిన తమ్ముడిని ఇరువై నాలుగు గంటల్లోపు అరెస్ట్ చేశారు చెన్నారావుపేట పోలీసులు. నిందితుడి నుంచి 75 గ్రాముల బంగారు ఆభరణాలు ఒక లక్ష 40 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ పి.కరుణాకర్ వివరాలను వెల్లడిస్తూ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన మండల రవి, రోజువారి కూలీగా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. దీనితో నిందితుడికి అప్పులు కూడా అధికంగా చేసేవాడు. కొద్ది రోజుల క్రితం ఇదే గ్రామంలో ఉంటున్న రవి అన్నయ్య మండల సుధాకర్ కుమారుడి వివాహం చేశాడు. రవి గత కొద్ది రోజులుగా ఎలాంటి పనులు చేయకుండా కేవలం మద్యం సేవిస్తూ కాలం గడుపుతుండం, అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా ఒత్తిళ్లు అధికం కావడంతో సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు నిందితుడు రవి. ఇటీవల తన అన్న కుమారుడి వివాహం అవ్వడంతో అన్నయ్య ఇంటిలో డబ్బు, బంగారు ఆభరణాలు ఉండడాన్ని గమనించి టైం చూసి చోరీ చేసేందుకు సిద్ధపడ్డాడు రవి.
తమ్ముడిపై అనుమానంతో నిఘా
ఈ నెల 26న అన్న కుటుంబ సభ్యులందరూ వేములవాడకు వెళ్లడాన్ని నిందితుడు రవి గమనించాడు. ఇదే అదునుగా భావించిన నిందితుడు అన్న ఇంటి తలుపులు తొలిగించి బీరువా తాళాలు పగుల గొట్టి బంగారు, డబ్బును చోరీ చేశాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన తల్లి.. సుధాకర్ కు సమాచారం ఇచ్చింది. వేములవాడ నుంచి వచ్చిన సుధాకర్ ఇంట్లో దొంగలుపడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న నెక్కొండ ఇన్స్పెక్టర్ హాతీరాం విచారణ చేపట్టారు. సుధాకర్ తమ్ముడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అన్న సుధాకర్ ఇంట్లో తమ్ముడే చోరికి పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు చోరీ సొత్తు నుంచి కొంత డబ్బును తీసుకోనేందుకు ఇంటికి వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో అతడ్ని పట్టుకుని చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లో గుప్తనిధుల కలకలం
హైదరాబాద్‌లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టడం సంచలనంగా మారింది. రాజేంద్రనగర్ లోని బద్వేల్ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో సోమవారం రాత్రి పలువురు దుండగులు తవ్వకాలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలోనే తవ్వకాలు చేపడుతున్న తొమ్మిది మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి మూడు కార్లు, 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టడం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే అరెస్ట్ అయిన నిందితులు గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఇంట్లో తవ్వకాలు చేపడుతున్నారు. అయితే ఈ ఇల్లు ఇందిరమ్మ అనే ఓ మహిళకు సంబంధించింది. అయితే గుప్తనిధులు తవ్వేందుకు నేతృత్వం వహించిన వ్యక్తి ఇంటి ఓనర్ ఇందిరమ్మ రెండో అల్లుడు వినోద్. ఓ బాబా సహాయం తీసుకున్న ఇతను.. కొంత మందిని ఇంటికి పిలిపించుకొని గత మూడ్రోజులుగా తవ్వకాలు చేపడుతున్నాడు. అయితే తరచూ చప్పుడు రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా వానికి పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.