అన్వేషించండి

Vijayawada Crime: విజయవాడలో విషాదాలు - రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం, మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి

Women Dancer suspicious death in Vijayawada | విజయవాడ: విజయవాడలో విషాదాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ వారధి జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. చూడటానికే భయానక పరిస్థితి కనిపించింది. అజిత్‌ సింగ్‌నగర్‌లో మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది.

వారధి జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
విజయవాడ వారధి జంక్షన్ గుడ్ మార్నింగ్ టీ స్టాల్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శీను అనే వ్యక్తి రాణిగారి తోటలో నివాసం ఉంటున్నాడు. ముఠా పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. రోడ్డు దాటే క్రమంలో లారీ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. బండి చక్రాలలో ఇరుకుపోయి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. పని ముగించుకొని మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

చెన్నై - విశాఖపట్నం రహదారిపై దూసుకొచ్చిన AP 39U7463 అనే లోడ్ లారీ విజయవాడ వారధి జంక్షన్ దాటక సాయిబాబా టెంపుల్ సమీపంలో శ్రీనును ఢీకొట్టింది. అనంతరం 10 మీటర్ల మేర ఈడ్చుకెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయి తీవ్ర రక్తస్రావం కావడంతో శ్రీను చనిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శ్రీను మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అతివేగమే కారణమా, లేక శ్రీను అజాగ్రత్తగా నడవడంతో ప్రమాదం జరిగిందా తెలియాల్సి ఉంది.

ఈవెంట్‌ మహిళా డ్యాన్సర్‌ అనుమానాస్పద మృతి
విజయవాడలోని అజిత్‌ సింగ్‌ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈవెంట్‌ మహిళా డ్యాన్సర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. బంటుపల్లి వెంకటలక్ష్మి(25) కాకినాడ నుంచి విజయవాడకు ఉపాధి కోసం వచ్చింది. గత కొంతకాలంగా విజయవాడలో నివాసం ఉంటూ కెరీర్ ను మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. డ్యాన్సర్ వెంకట లక్ష్మీ అజిత్ సింగ్ నగర్ లో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. ఉరి వేసుకున్న స్థితిలో మహిళా డ్యాన్సర్ డెడ్ బాడీని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు అజిత్ సింగ్ నగర్ చేరుకుని పరిశీలించారు. మహిళా డ్యాన్సర్ వెంకట లక్ష్మీ శరీరంపై గాయాలు ఉండటంతో ఇది కచ్చితంగా హత్య అయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమెకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ప్రేమ వ్యవహారం ఉన్నాయా.. లేక డబ్బులు, నగల కోసం హత్య చేసి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Embed widget