Srikakulam News: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి దాడి- ఇద్దరు మృతి, మరో మహిళకు తీవ్రగాయాలు
Vajrapukotturu News: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఇద్దరి వ్యక్తులను చీల్చి రక్తాన్ని తాగేంది.
Bear Attack At Vajrapukotturu In Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎలుగుబంటి ఇద్దరి ప్రాణాలను తీసేసింది. జనం చూస్తుండగానే వ్యక్తిని చంపి రక్తం తాగిన ఎలుగు బంటిని చూసి అంతా భయభ్రాంతులకు గురయ్యారు. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఊరికి సమీపంలో ఉన్న తోటకి వెళ్లి ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో సిహెచ్ లోకనాథం, లైశెట్టి కుమార్ మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
ఈ విషాధ ఘటనను విన్న ఉద్దానం వాసులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎలుగు బంట్లు ఎప్పటికప్పుడు వచ్చి బీభత్సం సృష్టిస్తున్నా అధికారులు పెట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా వాటిని పట్టుకొని జూకు తరలించాలని వేడుకుంటున్నారు.
ఇద్దరి ప్రాణాలు పోవడం ఓ మహిళ గాయాలతో ఆసుపత్రి పాలవ్వడంతో అనకాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయపడిన మహిళ త్వరగా కోలుకోవాలని గ్రామస్థులు ప్రార్థిస్తున్నారు.