అన్వేషించండి

TTD Vigilance Officers: వరుస వివాదాల్లో కాణిపాకం ఆలయ సిబ్బంది - పోలీసుల అదుపులో గ్యాస్ ఆపరేటర్, ఆలయ ఏఈవో

TTD Seva Ticket Scam: సుపధం మార్గం దర్శనంను సేవగా భక్తులను నమ్మించి 12 సుపధం టిక్కెట్లను అధిక ధరకు విక్రయించిన‌ దళారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కాణిపాకం ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్న సిబ్బంది..
కాణిపాకం ఆలయం పిఆర్ఓగా గ్యాస్ ఆపరేటర్  తిరుమలలో చలామణి
సుపధం టిక్కెట్టుని సేవగా నమ్మించి భక్తుల వద్ద భారీ నగదు కాజేసిన దళారి
భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టిటిడి విజిలెన్స్..
పోలీసుల అదుపులో గ్యాస్ ఆపరేటర్, కాణిపాకం ఆలయ ఏఈవో

TTD Seva Ticket Scam: తిరుమల పుణ్యక్షేత్రంలో దళారులు చాప కింద నీరులా భక్తులను మోసగిస్తున్నారు. దర్శనం కోసం చూసే భక్తులను టార్గెట్ గా చేసుకుని నిలువునా దోచేస్తున్నారు. దర్శన టోకెన్లు లేని భక్తులను గుర్తించి వారి వద్ద అధిక మొత్తంలో నగదు వసూలు చేసి జోబులను నింపుకుంటున్నారు కొందరు దళారులు. ఏడుకొండలపై పిఆర్ఓల పేరుతో కొందరు దళారులు భక్తులను బురిడీ కొట్టిస్తూ అందిన వరకూ దోచేస్తూ వేలకు వేలు దండుకుంటున్నారు. తాజాగా కాణిపాకం ఆలయంలో కాంట్రాక్టు గ్యాస్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న కరుణాకర్ అనే దళారి మూడు వందల రూపాయలు విలువ గల సుపధం మార్గం దర్శనంను సేవగా భక్తులను నమ్మించి 12 సుపధం టిక్కెట్లను అధిక ధరకు విక్రయించిన‌ దళారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దళారితో పాటుగా కాణిపాకం ఆలయ ఏఈవోను సైతం పోలీసులు విచారిస్తున్నారు.

ప్రతి నిత్యం వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణలతో ఏడు కొండలు మారుమోగుతుంటాయి. స్వామి వారి దర్శనం పొందేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడరు. స్వామి వారికి ఉన్న డిమాండ్ నే కొందరు క్యాష్ చేసుకుని కొందరు అమాయకులను నమ్మించి నిలువుగా దొపిడి చేస్తున్నారు. వైసీపి అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భాధ్యతలు చేపట్టిన తరువాత కొండపై దళారుల ఏరివేతకు టీటీడీ చర్యలు తీసుకుంది. భక్తులను మోసగించే దళారులపై కేసు నమోదు చేసి కఠన చర్యలు తీసుకున్నారు. దీంతో కొద్ది రోజుల పాటు నెమ్మకుండి పోయినా దళారులు కొత్త కొత్త ఆలోచనలతో, చాప కింద నీరులా భక్తులను మోసగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దళారిగా మారిన గ్యాస్ ఆపరేటర్
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ లో గ్యాస్ ఆపరేటర్ గా కరుణాకర్ విధులు నిర్వహిస్తున్నాడు. కాణిపాకం ఆలయంలో గత కొద్ది రోజుల‌ కిందట కొంత వివాదంలో చిక్కుకోవడంతో కరుణాకర్ ను ఆలయ అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో తిరుమలలో కాణిపాకం ఆలయ పిఆర్ఓగా అవతారం ఎత్తాడు. కాణిపాకంలో పని చేస్తున్న సమయంలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని సులభతరంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం పరిచయం ఉన్న అధికారులు, రాజకీయ నాయకుల నుంచి దర్శనం‌ సిఫార్సు లేఖలను పొంది దర్శనం లేని భక్తులను గుర్తించి వారి పేర్లతో టీటీడీ ఛైర్మన్ కార్యాలయం, జేఈవో కార్యాలయంలో కాణిపాకం ఆలయం పిఆర్ఓగా చెప్పకుంటూ దర్శనాలు పొందుతూ వచ్చేవాడు. ఈ టిక్కెట్లను సుదూర‌ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు అధిక ధరలకు విక్రయించేవాడు. 
గతంలో కాణిపాకం ఈవోగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్ తన కుటుంబ సభ్యులకు దర్శనం కల్పించాలని టీటీడీకి లెటర్ పంపాడు. అందులో మరో ముగ్గురి పేర్లు చేర్చిన కరుణాకర్ వారి వద్ద అధిక డబ్బును వసూలు చేశాడు. ఈవో కుటుంబ సభ్యులతో పాటు వీరు ఎవరు అని విజిలెన్స్ సిబ్బంది ప్రశ్నించడంతో మూడు టిక్కెట్లు అమ్మేశాడని తేలింది. ప్రముఖ ఆలయం, తన పరువు పోతుందని, టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని‌ వెంకటేశ్ విన్నవించుకోవడంతో కరుణాకర్ ని‌ మందలించి వదిలి పెట్టారు. అంతటితో ఆగకుండా తన కుటుంబ సభ్యులకు దర్శనంకు వెళ్ళేందుకు సిఫార్సు లేఖ కావాలని చెప్పి మరో‌సారి ఆలయంలోని‌ ఓ‌ అధికారి పేరు‌ మీదుగా విఐపి బ్రేజ్ దర్శనం టిక్కెట్లను పొంది వాటిని అధిక ధరలకు విక్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న కాణిపాకం ఆలయ‌ ఈవో కరుణాకర్ ను పిలిచి‌గెట్టిగా మందలించాడు. కొద్ది‌రోజుల పాటు తన రహస్యంగా బయటి అధికారులు, రాజకీయ నాయకుల‌ సిఫార్సు‌ లేఖలపై దర్శనాలను‌ పొందుతూ వాటిని విక్రయిస్తూ వచ్చేవాడు. సిఫార్సు లేఖ లభించక పోవడంతో తన కుటుంబ సభ్యులకు దర్శనం కల్పించాలంటూ కాణిపాకం ఆలయ ఏఈవో మాధవ్ రెడ్డిని కోరాడు. 

గతంలో‌ కాణిపాకం ఆలయంలోని అన్నదాన సత్రంలో గ్యాస్ ఆపరేటర్ గా పని చేసే సమయంలో కాణిపాకం ఆలయ ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న మాధవ్ రెడ్డి తో కరుణాకర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకే ఆలయంలో పని చేస్తున్న వ్యక్తులు కావడంతో ఏఈవోతో మరింత స్నేహపూర్వకంగా మెలిగేవాడు కరుణాకర్. మాధవ్ రెడ్డి వద్ద లెటర్ హెడ్ పొందిన కరుణాకర్ కర్ణాటక రాష్ట్రం, చింతామణికి చెందిన కేశవమూర్తి కుటుంబ సభ్యులను సంప్రదించాడు. శ్రీవారి వద్ద కూర్చొని ఉండే సేవ టిక్కెట్లు తీసిస్తానని నమ్మబలికాడు. ఒక్కో టికెట్ ధర రూ. 6000 వేలుగా బేరం ఆడాడు. చివరికి ఒక్కో టికెట్ ధర రూ. 3300గా నిశ్చయించాడు. చివరకు ఆ భక్తులను సుపథం టిక్కెట్ల ద్వారా దర్శనానికి తీసుకెళ్లాడు. సేవ అని చెప్పి సుపథంకి తీసుకెళ్లాడని కరుణాకర్ పై పోలీసులకు పిర్యాదు చేసాడు కేశవమూర్తి. దింతో కరుణాకర్ ను అదుపులోకి తీసుకోని విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఈ టిక్కెట్ల స్కాంకు సంబందించి కాణిపాకం ఆలయ ఏఈవో మాధవ్ రెడ్డిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు పోలీసులు. 

కాణిపాకం ఈవో ఏం అన్నారంటే...
ఈ ఘటనపై కాణిపాకం ఆలయ ఈవో రాణాప్రతాప్ ను సంప్రదించగా "ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ఏఈవోపై చర్యలు తీసుకుంటాం. ఏఈవో తప్పు చేసినట్లు ఎఫ్ఐఆర్ కాఫీలో పోలీసులు నిర్ధారణకు వస్తే మెమో జారీ చేస్తాం. తన వద్ద నుంచి అంజాయిషి లేఖను కోరుతాం. ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న కరుణాకర్ ను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని" కాణిపాకం ఈవో రాణాప్రతాప్ ఫోన్ సంభాషణలో తెలిపారు. అయితే ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతుందని, ఏఈవో మాధవ్ రెడ్డిని విచారిస్తున్నాంమని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తిరుమల అడిషనల్ ఎస్పి మునిరామయ్య వెల్లడించారు. ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దర్శన టికెట్ల‌ను బుక్ చేసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు అధికారులు‌ భక్తులను విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Highlights | ఆర్సీబీ విక్టరీతో సంతోషంలో చెన్నై, ముంబై ఇండియన్స్ | ABP DesamSRH vs RCB Match Highlights | సన్ రైజర్స్ మీద మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ బౌలర్లు | IPL 2024 | ABPVirat Kohli Half Century | SRH vs RCB మ్యాచ్ లో మరో అర్థశతకం చేసిన విరాట్ కొహ్లీ | IPL 2024 | ABPSRH vs RCB Match Highlights | ఉప్పల్ లో సన్ రైజర్స్ కి ఓటమి రుచి చూపించిన ఆర్సీబీ | IPL 2024 | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Megha Akash: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ITR 2024: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
Embed widget