By: ABP Desam | Updated at : 22 May 2022 09:47 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను హత్య చేయబోయి మరో మహిళను చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగింది. అంబూర్ టౌన్‌లోని నేతాజీ రోడ్డులో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది.
తిరువణ్ణామలై జిల్లాలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఇందిరానగర్ ప్రాంతంలో దేవేంద్రన్ అనే 55 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు పశువుల వ్యాపారి. అతని మొదటి భార్య రెండు సంవత్సరాల క్రితం మరణించింది. అదే ప్రాంతానికి చెందిన సురేష్ వ్యక్తి కూడా చనిపోవడంతో అతని భార్య ధనలక్ష్మితో ఇతనికి గత 5 నెలల క్రితం పెళ్లి జరిగింది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న క్రమంలో కొద్ది రోజుల క్రితం నుంచి దేవేంద్రన్ ధనలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన ధనలక్ష్మి అంబూరుకు వచ్చి ఉంది. దీంతో ఆంబూరులోని షాపుల ముందు దేవేంద్ర భార్య ధనలక్ష్మి రాత్రి నిద్ర పోతోందని అతనికి సమాచారం అందింది.
ఈ నేపథ్యంలో నిన్న అర్ధ రాత్రి ఒంటిగంట సమయంలో అంబూరుకు వచ్చిన దేవేంద్రన్ దుకాణాల ముందు నిద్ర పోతున్న మహిళను తన భార్య ధనలక్ష్మిగా భావించి మరో మహిళ మెడపై, ఛాతీపై కత్తితో పొడిచాడు. ఆ మహిళ కేకలు వేయడంతో ఆమె తన భార్య కాదని, వేరొకరి భార్య అని దేవేంద్రన్‌కు తెలిసింది. మహిళ అరుపులు విని అక్కడున్న వారు దేవేంద్రన్ ను పట్టుకుని కొట్టారు.
దీనిపై స్థానికులు వెంటనే అంబూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ తర్వాత దేవేంద్ర కత్తిపోట్లకు గురైన మరో మహిళ రక్తపు మడుగులో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. గాయపడిన వ్యక్తిని వేలూరు అడుక్కంపర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Political Cheating : పార్టీలో చేరితే చాలు ఇల్లు, ఫ్లాట్లట - తీరా చేరిన తర్వాత !
Saral Vastu Chandrashekhar Guruji : "సరళ వాస్తు" చంద్రశేఖర్ గురూజీ హత్య - కర్ణాటకలో దారుణం !
Crime News Cheating : కోటి లాటరి అని ఆశకు పోతే ఉన్నదంతా ఊడ్చుకుపోయింది - ఈ మోసగాళ్లు చాలా డేంజర్ !
Nizamabad News: మాస్క్ ఒక్కటే క్లూ- పోలీసులకు సవాల్‌గా నిజామాబాద్ బ్యాంక్ దోపిడీ కేసు
Crime News : సోషల్ మీడియాలో కనిపించే "సమస్యలు పరిష్కరించే బాబా"ను సంప్రదించాడు - 38 లక్షలు పోగొట్టుకున్నాడు !
Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!
YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !
Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు
Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !