By: ABP Desam | Updated at : 30 Nov 2022 07:37 PM (IST)
ఛేజ్ చేసి ఎర్రచందనం కూలీలను పట్టుకున్న పోలీసులు
Red Sandalwood Labourers Arrested in Chittoor District: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎర్రచందనం అక్రమ చేసే స్మగ్లర్స్ ను పట్టుకునేందుకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వడమాలపేట టోల్ ప్లాజా సమీపంలో తమిళనాడు నుంచి ఎర్రచందనం కూలీల వస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సినిమా సీన్ ను తలపించేలా ఓ రేంజ్‌లో ఛేజ్ చేసి మరి 44 ఎర్రచందన కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 81 ఎర్రచందనం దుంగలను, రెండు లారీలను, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి - చెన్నై జాతీయ రహదారిలో పోలీసులు నిఘా..
తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వడమాల పేట మండలం, టోల్ ఫ్లాజా సమీపంలోని తిరుపతి - చెన్నై జాతీయ రహదారి (Tirupati - Chennai National Highway)లో గల శివ శక్తి దాబా వద్ద మంగళవారం సాయంత్రం భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టామన్నారు. అయితే మారుతీ సుజుకి స్విఫ్ట్ వాహనాన్ని ఫైలైట్ వాహనంగా ముందు వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వచ్చిన TN97-9837 ఐచర్ లారీ, అశోక్ లేలాండ్ TN 52D0988 రావడంతో వాహనాలను వెంబడించారని తెలిపారు. అనుమానం వచ్చిన లారీ డ్రైవర్లు దిశను మర్చి తిరుపతి వైపు వెళ్ళే ప్రయత్నం చేశారని, ముందుగా ఏర్పాటు చేసిన బారీకేడ్స్, రెండు అదనపు పార్టీల సహాయంతో పుష్ప సినిమాను తలపించేల చేసింగ్ చేసి పట్టుకున్నట్లు వివరించారు.
2 కోట్లు విలువ గల ఎర్ర దుంగలు స్వాధీనం..
ప్రధాన మేస్త్రి అయినా సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నామని, మరో ప్రధాన మేస్త్రి స్వామి నాథన్ ను అదుపులోకి తీసుకోని కింగ్ పిన్స్ ను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ స్పష్టం చేసారు. ఈ సినిమాటిక్ ఛేజింగ్ లో ఇద్దరు డ్రైవర్లను, 42 మంది కూలీలతో పాటుగా, 2 కోట్లు విలువ గల 2632.4 కేజీల బరువుగల 81 ఎర్ర చందనం దుంగలను, 11 గొడ్డళ్లు, 32 రంపాలు, అశోక్ లైలాన్ లారీ, స్విఫ్ట్ కారు, ఐచర్ లారీ స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఎర్ర కూలీలను పట్టుకున్న పోలీసులకు అధికారుల రివార్డులు
ఇంత భారీ స్థాయిలో ఎర్ర చందనం కూలీలను పట్టుకొని, దుంగలను స్వాధీన పరుచుకోవడంలో ప్రతిభ కనబరచిన పుత్తూరు SDPO రామరాజు, భాకరాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ M. తులసిరాం, పుత్తూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ M. సురేశ్ కుమార్, వడమలపేట పోలీస్ స్టేషన్ SI E. రామాంజనేయులు, నారాయణవనం పోలీస్ స్టేషన్ SI M. పరమేష్ నాయక్, KVB పురం పోలీస్ స్టేషన్ SI P. సునీల్, పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్ SI, P. వెంకట మోహన్, తిరుపతి AR 4 వ బెటాలియన్ RSI సుబ్బరాజు లను తిరుపతి ఎస్పీ అభినందించారు. వారికి తగిన రికార్డులు ప్రకటించారు.
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Peddapalli Crime : రౌడీషీటర్ సుమన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, పాతకక్షలతో మర్డర్!
Satysai District Crime News: సత్యసాయి జిల్లాలో దారుణం - ఆరో తరగతి విద్యార్థినిపై యువకుడి అత్యాచార యత్నం
Hyderabad: ఒకరోజులో 20 ఇళ్లలో దొంగతనాలు! అవాక్కైన పోలీసులు - ఎట్టకేలకు అరెస్టు
Rompicharla: టీడీపీ లీడర్పై తుపాకీ కాల్పుల కలకలం- ఆ వైసీపీ ఎమ్మెల్యే పనేనంటున్న తెలుగుదేశం
BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబు అంటున్న మంత్రి కేటీఆర్
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!