అన్వేషించండి

Husband Killed by wife: చెంబుతో కొట్టి భర్తను హత్య చేసిన భార్య- కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణ

రోజూ మద్యం తాగి వచ్చి ఇబ్బందులు గురిచేయడమే కాకుండా సొంత కూతురి పట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ కట్టుకున్న భర్తను చెంబుతో తలపై మోది హత్య చేసింది.

రోజూ మద్యం తాగి వచ్చి ఇబ్బందులు గురి చేయడమే కాకుండా సొంత కూతురి పట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ భర్తను చంపేసింది. చెంబుతో తలపై కొట్టి హత్య చేసింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు విషయాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు..

అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఇసుకపట్ల రామకృష్ణ స్థానికంగా కొబ్బరి దింపు కార్మికునిగా పనిచేసుకుంటున్నారు. అతని భార్య సత్యనారాయణమ్మ కూలి పనులకు వెళ్తుంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కొంత కాలంగా రామకృష్ణ(34) బాగా మద్యానికి బానిస అయ్యాడు. కొబ్బరి దింపుల ద్వారా వచ్చిన కూలి డబ్బులతో ప్రతీ రోజూ మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు. రామకృష్ణ ఇంట్లో తరచూ గొడవలు పడుతుండేవాడు. 
శుక్రవారం బాగా మద్యం సేవించి వచ్చిన రామకృష్ణ భార్యతో తీవ్రంగా గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన భార్య సత్యనారాయణమ్మ చెంబుతో తలపై మోదడంపై కిందపడిపోయాడు. అక్కడి నుంచి దొర్లి వాకిట్లో పడి మృతి చెందాడని నిందితురాలు చెబుతుంది.

కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు.
బాగా మద్యం తాగి వచ్చిన రామకృష్ణ సొంత కూతురి పట్లా అసభ్యంగా ప్రవర్తించబోయాడని నిందితురాలు చెబుతోంది. శుక్రవారం రాత్రి బాగా తాగి వచ్చి ఇంట్లో గొడవకు దిగాడని, ఆ తరువాత అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో వచ్చి నిద్రిస్తున్న కుమార్తె పట్లా అసభ్యంగా ప్రవర్తించబోయాడని ఆరోపిస్తోంది. అందుకే చెంబుతో దాడి చేసానని పోలీసులకు తెలిపింది. ఎంత తాగి వచ్చి గొడవకు దిగినా భరించానని, కుమార్తె పట్లా అసభ్యంగా ప్రవర్తించే సరికి కోపంతోనే చెంబుతో కొట్టానని చెబుతోంది. అయితే చనిపోతాడని అనుకోలేదని నిందితురాలు పోలీసుల విచారణలో తెలిపింది. ఈ సంఘటనపై అయినవిల్లి ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget