(Source: ECI/ABP News/ABP Majha)
Viral Video: అమాయకుల ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు: సజ్జనార్ వీడియో పోస్ట్ వైరల్
TGSRTC MD Sajjanar | సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ రోడ్డు ప్రమాదం వీడియోను షేర్ చేశారు. నిర్లక్ష్యంగా వాకర్ ను ఢీకొట్టడంతో పాటు ఏం జరిగిందని చూడకుండా వెళ్లిపోయారు.
TGSRTC MD Sajjanar Shares Video of Road Accident | అమాయకుల ప్రాణాలు హైదరాబాద్: అప్పటివరకూ ఎంతో ఆరోగ్యంగా కనిపించినా, ఏ క్షణాన ఎవరి ప్రాణాలు ఎలా పోతాయో ఎవరూ చెప్పలేరు. కొందరు చిన్న విషయాలకు జీవితంలో ఓడిపోయామంటూ ఆత్మహత్య చేసుకుంటుంటే.. మరికొందరు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాలలో ఇతరి ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి ఓ ఘటనపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ ఇదీ..
‘ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు మరొకరి ప్రాణం బలైంది. కారుతో పాదచారుడిని ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా కారు డ్రైవర్ వెళ్లిపోయాడు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఈరోజు జరిగిన ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందారు. రోడ్లపైకి వాహనాలతో వచ్చి ఇష్టారీతిన నడుపుతూ అమాయకపు ప్రాణాలను తీయడం ఎంత వరకు సమంజసం!?’ అని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రజల ప్రాణాలు విలువైనవి అని, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను బలిగొనడం సమంజసం కాదని తరచూ సజ్జనార్ ఎక్స్ ఖాతాలో వీడియోలు, సమాచారం పోస్ట్ చేస్తుంటారు. తాజాగా సజ్జనార్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు ఓ ప్రాణం బలైంది. కారుతో పాదచారుడిని ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా వెళ్లిపోయారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇవాళ జరిగిన ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందారు. రోడ్లపైకి వాహనాలతో వచ్చి ఇష్టారీతిన నడుపుతూ అమాయకపు ప్రాణాలను తీయడం… pic.twitter.com/oeUlyugbZ8
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 2, 2024
దేశ వ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి కొత్త చట్టాలు అమలులోకి రావడం తెలిసిందే. భారతీయ న్యాయ సన్హిత కింద మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలోకి వచ్చాయి. దాని ప్రకారం ఆన్ లైన్‌లో ఎక్కడినుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. అరెస్టుకు ముందు తమ అరెస్ట్ విషయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు చట్టాల్లో ఉంది. డ్రైవింగ్ కు సంబంధించి సైతం చట్టాలు కఠినం చేశారు. ప్రమాదాలు తగ్గించాలని, ప్రజలకు భద్రత పెంచాలని మైనర్లు డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. వయోజనులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా, మద్యం తాగి వాహనం నడిపినా కొత్త చట్టాల ప్రకారం భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.