Janagama News : జనగామ చిన్నారి మృతి కేసులో ట్విస్ట్, తల్లే సంపులో పడేసినట్లు అనుమానాలు!
Janagama News : జనగామలో చిన్నారి మృతి కేసులో మరో విషయం వెలుగుచూసింది. తల్లే చిన్నారిని సంపులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా చైన్ స్నాచర్ చిన్నారిని సంపులో పడేసినట్లు తల్లి చెప్పింది.
Janagama News : జనగామలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నెలల పసికందును తల్లే సంపులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందింది. అయితే చిన్నారిలో ఎదుగుదల లేకపోవడంతో తల్లే ఇలా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చిన్నారి తల్లి ప్రసన్న ముందు మరో కథ చెప్పింది. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. అంతకముందు చైన్ స్నాచర్ చిన్నారిని సంపులో పడేశాడని తల్లి పోలీసులకు చెప్పింది.
చైన్ స్నాచింగ్ కథ
జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ నగర్ లో రోడ్డుపై వెళుతున్నప్పుడు చైన్ స్నాచర్ తన మెడ లోని మంగళసూత్రాన్ని దొంగలించడానికి ప్రయత్నించాడని ప్రసన్న తెలిపింది. తాను ప్రతిఘటించడంతో పెనుగులాటకు జరిగిందని, ఈ క్రమంలో దొంగ తన చిన్నారిని తీసుకుని పక్కనే ఉన్న నీటి సంపులో పడేసి వెళ్లిపోయాడని చిన్నారి తల్లి ప్రసన్న చెప్పింది. ప్రసన్న చెప్పిన విషయాన్ని భర్తతో సహా అందరూ నమ్మారు. స్థానికులు సంపులో పాప తేజస్విని మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ విషయాన్ని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు విషయం తెలుసుకుని కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో పోలీసులు ప్రసన్నను అనుమానించారు. ఆమె చెప్పిన వివరాలపై ఆరా తీసిన పోలీసులు ప్రసన్న చిన్నారిలో సంపులో పడేసినట్లు అనుమానిస్తున్నారు.
పొంతన లేని సమాధానాలతో అనుమానం
జనగామ అంబేడ్కర్ నగర్ చైన్ స్నాచింగ్ కేసులో మరో విషయం వెలుగుచూసింది. పసిపాప తల్లి ప్రసన్న పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానాలు రేకెత్తాయి. పసికందు సంపులో పడిపోయిందని ఆమె ముందుగా స్థానికులకు చెప్పింది. కాసేపటికి మాటమార్చి చైన్ స్నాచింగ్ కు యత్నించిన వ్యక్తి పసికందును సంపులో పడేశాడంటూ చెప్పింది. ప్రసన్న పొంతన లేని జవాబులతో కుటుంబసభ్యులను పోలీసులు విచారించారు. భాస్కర్, ప్రసన్నల రెండో సంతానం తేజస్వినికి ఏడాది వయసు. పాప ఎదుగుదల లేక అనారోగ్యంగా ఉండడంతో తల్లి ప్రసన్న చిన్నారిని సంపులో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగంగా చేస్తున్నారు.
Also Read : Loan Apps News: నందిగామ యువతి సూసైడ్ అసలు కారణం ఇదే, తేల్చిన పోలీసులు
Also Read : ‘కట్నం తీసుకురా లేదా నా ఫ్రెండ్‌తో ఎంజాయ్ చెయ్!’ భార్య నగ్న వీడియోలు వాట్సప్ చేసిన పైశాచిక భర్త