అన్వేషించండి

Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లాలో దారుణం... మద్యం తాగొద్దన్నందుకు కత్తితో దాడి... భార్య, సోదరిని హత్య చేసి ఆపై ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం వద్దని వారించిన కుటుంబ సభ్యులపై దాడి చేశాడో వ్యక్తి. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ముద్దాడపేటకు చెందిన రీసు అప్పన్న శనివారం మద్యం మత్తులో కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య అప్పమ్మ, సోదరి చెల్లుబోయిన రాజు అక్కడికక్కడే మృతి చెందారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు అప్పన్న. కత్తితో పొడుచుకోవడంతో అప్పన్న కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పోలీసులు, క్లూస్ టీం పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో అప్పన్న ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

మద్యం మానమన్నందుకు

ముద్దాడపేటలో నివాసం ఉంటున్న రీసు అప్పన్న మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగొద్దని భార్య, బంధువులు వారించేవారని స్థానికులు అంటున్నారు. తననే మద్యం మానేమంటారా అని కోపంతో కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు అప్పన్న. భార్య, సోదరి హత్య చేశాడు. తర్వాత ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. భార్యను చంపుతుండగా అడ్డొచ్చిన తన తండ్రితో పాటు సోదరి కుమార్తె కూడా అప్పన్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వాళ్లిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారితో పాటు అప్పన్నను శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పబ్జీకి బానిసై

పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లాహోర్ ఖన్నా ఏరియాలో నహిద్ ముబారక్  (45) ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తోంది. ఈమె 14 ఏళ్ల కుమారుడు గత కొంతకాలం నుంచి చదవడం లేదు. ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్లో పబ్‌జీ గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. శుక్రవారం నాడు దీనిపై ఇంట్లో గొడవ జరిగింది. పబ్‌జీ ఆడొద్దని బాలుడ్ని తల్లి మందలించింది. తన ఇష్టం ఇని కుమారుడు సమాధానం చెప్పడంతో పదే పదే వారించారు. తనను ఆన్‌లైమ్ ఆడుకోనిస్తలేరని బాలుడు విసుగుచెందాడు. పబ్‌జీ గేమ్ మత్తులో పడిపోయిన బాలుడు తుపాకీ తీసుకొచ్చి తల్లి, సోదరీమణులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు మైనర్ బాలికలు చనిపోయారు.17, 11 ఏళ్ల వయసున్న మైనర్లు చనిపోయారని పీటీఐ రిపోర్ట్ చేసింది. బాలికలు నిద్రపోతుండగా వారిపై సైతం కాల్పులు జరిపినట్లు సమాచారం. తమ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. తాను పై అంతస్తులో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంటికి వచ్చి కాల్పులు జరిపి తల్లిని, సోదరిమణులను హత్య చేశాడని ఆరోపించాడు.   

Also Read: పబ్‌జీ గేమ్‌కు బానిసైన బాలుడు.. మందలించారని తల్లి, అక్కాచెల్లెల్ని కాల్చి చంపాడు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget