Srikakulam Crime News: అనుమానమే పెనుభూతమై భార్యాబిడ్డలపై కత్తితో దాడి- స్పాట్ లోనే చనిపోయిన కూతురు!
Srikakulam Crime News: భార్యపై భర్తకు ఏర్పడిన అనుమానం ఆ తల్లీబిడ్డల పాలిట శాపంగా మారింది. అనుమానంతో తల్లీకూతుళ్లిద్దరిపై కత్తితో దాడి చేయగా.. కుమార్తె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.
![Srikakulam Crime News: అనుమానమే పెనుభూతమై భార్యాబిడ్డలపై కత్తితో దాడి- స్పాట్ లోనే చనిపోయిన కూతురు! Srikakulam Crime News Man Attacks Wife Daughter With Knife, Daughter dies Srikakulam Crime News: అనుమానమే పెనుభూతమై భార్యాబిడ్డలపై కత్తితో దాడి- స్పాట్ లోనే చనిపోయిన కూతురు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/17/1eb928801153eec0259db3f4c01a91631676631179921519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Srikakulam Crime News: 35 ఏళ్ల క్రితం వారిద్దరికీ పెళ్లి జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా 30 ఏళ్ల క్రితం ఓ పాప కూడా పుట్టింది. అయితే ఇన్నాళ్లూ హాయిగా సాగిన వీరి కాపురంలో అనుమానం అనే భూతం ఎంటర్ అయింది. చాలా సంతోషంగా ఉన్న కుటుంబాన్ని ముక్కలు చేసింది. ఇంతకాలం భార్య, కూతురును ఎంతో ప్రేమగా చూసుకున్న తండ్రికి.. ఈ మధ్య ఆలిపై అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే తరచుగా భార్యతో గొడవపడుతున్నాడు. ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తున్నాడు. తాజాగా ఈరోజు కూడా గొడవ జరిగింది. కోపం పట్టలేని అతడు భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డం వచ్చిన కూతురిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భార్య ప్రస్తుతం కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అసలేం జరిగిందంటే..?
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని చొట్టవాని పేటలో కసాయి భర్త కొల్లి రామారావు తన భార్య కొల్లి సూర్యం పై అనుమానంతో వేధించాడు. ఈనేపథ్యంలో భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన కొల్లి రామారావు.. 55 ఏళ్ల వయసున్న తన భార్య సూర్యం, 30 ఏళ్ల వయసు ఉన్న కూతరు విజయపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్లుగా నరకడంతో కూతురు విజయ అక్కడికక్కడే చనిపోయింది. భార్య మాత్రం కొన ఊపిరితో రక్తపమడుగులో పడి ఉంది. అయితే విషయం గుర్తించిన స్థానికులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో కొల్లి రామారావు పరారయ్యాడు. వెంటనే స్థానికులంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సూర్యంను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంనది వైద్యులు చెబుతున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు విజయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. పారిపోయిన నిందితుడు కొల్లి రామారావు గురించి గాలింపు చర్యలు చేపడుతున్నారు.
వారం రోజుల క్రితం గుంటూరులో బాలిక దారుణ హత్య
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఫిబ్రవరి 13వ తేదీన ఓ బాలిక దారుణ హత్యకు గురైంది.ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో బాలికను ఓ దుండగుడు హత్య చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన బాలిక అంధురాలు. స్థానికంగా నివసించే ఓ యువకుడు ఓ కత్తితో బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని రాజు అని గుర్తించారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. నిన్న (ఫిబ్రవరి 12) రాజు యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లి చెప్పింది. బాలిక ఈ విషయాన్ని తనకు చెప్పినట్లుగా ఆమె తెలిపింది. దీంతో తాము అతడిని మందలించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. దుండగుడు డీఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. సీఎం నివాసానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనించదగ్గ విషయం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)