అన్వేషించండి

Praneeth Rao: SIB మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు - ఆ నేరాలకు పాల్పడినట్లు గుర్తింపు

Telangana News: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

Sensational Details in Praneeth Rao Remand Report: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నిందితుడు 3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 4న పాత హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం సహా ఏళ్ల తరబడి సీక్రెట్ గా సేకరించిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజు చెరిపేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ కేసు విచారణకు ఉన్నతాధికారులు ఆరుగురి సభ్యులతో టీంను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ విచారణాధికారిగా ఉండగా.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్ ఇన్ స్పెక్టర్, ఎస్సైలు ఉన్నారు. నిందితుడు నుంచి 3 సెల్ ఫోన్లు, ఓ ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో ప్రణీత్ రావు ఏం చెప్పారంటే.?

అయితే, ప్రత్యేక టీం విచారణలో ప్రణీత్ రావు పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. 'అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశా. ఈ సమాచారాన్ని అప్పటి ఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్ఐబీ చీఫ్ వరకూ అందరికీ అందజేశాను. కొందరు నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాను. చాలామంది అధికారులు, ప్రజా ప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్స్ పై నిఘా పెట్టాను. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చా. అప్పటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ఆదేశాలతో మొత్తం డేటాను ధ్వంసం చేశాను. సెల్ ఫోన్స్, హార్డ్ డిస్కులతో పాటు వేలాదిగా పత్రాలు ధ్వంసం చేశా.' అని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

మరోసారి విచారించేందుకు సిద్ధం

ప్రస్తుతం చంచల్ గూడ జైలులో 14 రోజుల రిమాండ్ లో ఉన్న ప్రణీత్ రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక అధికారుల బృందం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన్ను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు విచారణలో వెల్లడించిన అధికారులను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే.?

ఎస్‌ఐబీలోని ఎస్‌వోటీ ఆపరేషన్‌ హెడ్‌గా ఉన్న సమయంలో డీఎస్పీ ప్రణీత్‌రావు రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతలతో పాటు మావోయిస్టులు, ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల రోజు రాత్రి 9 గటల సమయంలో ఆయన లాగర్‌ రూమ్‌కు వెళ్లి హార్డ్‌ డిస్క్‌లతో పాటు డాక్యుమెంట్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఎస్‌వోటీ లాగర్‌ రూమ్‌ సీసీ కెమెరాలను ఆఫ్‌ చేయించారు. దాంతో ఆయన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఫోన్ల ట్యాప్‌ చేశారని ఆరోపణలకు పట్టు చిక్కినట్లయింది. లాగర్‌ రూమ్‌లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసి వెళ్లిపోయారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాపింగ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు పక్కా ఆధారాలు సేకరించి మార్చి 12న రాత్రి సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రే ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు.

Also Read: Komati Reddy On ED searches at Kavita house : బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ - కవిత ఇంట్లో సోదాలపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Adilabad Fake Aadhaar Certificate Gang Arreste: ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
Adilabad Bangladesh Illegal Burglar Gang Arrest: దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
Krishna Crime: కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget