అన్వేషించండి

Karnataka: 2వేలు లంచం తీసుకున్న ప్రభుత్వం డాక్టర్ ఐదేళ్లు జైల్లో - పేద తల్లిని పీడించిన వారికి సరైన శిక్షేగా!

Doctor in jail: ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు వేలు లంచం తీసుకున్నారా అంటే.. రెండు వేలే కదా అనేలా సమాజం మారిపోయింది. కానీ రెండు వేలు లంచం తీసుకున్నందుకు ఓ ప్రభుత్వ డాక్టర్ ఐదేళ్లు జైల్లో గడిపింది.

Doctor in jail for 5 yrs:  కర్ణాటకలోని తుమకూరు జిల్లా హాస్పిటల్‌లో గైనకాలజిస్ట్‌గా పనిచేసిన డాక్టర్ మహాలక్ష్మమ్మకు లంచం తీసుకున్నందుకు ల 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. డెలివరీ కోసం రూ. 3 వేలు లంచం డిమాండ్ చేసిన ఆమె, నిరుపేదలైన బాధితుల వద్ద  చివరికి రూ. 2 వేలు వసూలు చూశారు. దీనిపై  లోకాయుక్తా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కోర్టు శిక్ష విధించింది.  

2021లో  ఎమర్జెన్సీగా ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి లంచం వేధింపులు          

ఈ ఘటన 2021 ఫిబ్రవరి 2న జరిగింది. తుమకూరు జిల్లా హాస్పిటల్‌లో డెలివరీ కోసం ఓ గర్భిణీని బంధువులు ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అప్పటికే నొప్పులు ప్రారంభమయ్యాయి.  ఆమె భర్త వలస కూలిగా ఇతర ప్రాంతానికి వెళ్లాడు.  ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ మహాలక్ష్మమ్మను కలవమని చెప్పారు.  డాక్టర్ డెలివరీ చేయడానికి ముందు రూ. 3 వేల లంచం డిమాండ్ చేసింది. "డెలివరీ కేసులకు అందరూ రూ. 3 వేల లంచం చెల్లిస్తారు, మీరు మినహాయింపు కాదు," అని ఆమె స్పష్టం చేసింది.                    

మూడు వేలు ఇచ్చేదాకా వైద్యం చేయని డాక్టర్ - రెండు వేలు తీసుకుని చివరికి డెలివరి 

అప్పటికి వారికి వేరే మార్గం లేకపోయింది. పేద కుటుంబం ఈ డబ్బు సేకరించడానికి భారీగా కష్టపడింది. చివరికి రూ. 2 వేలు సమకూర్చి, ఆసుపత్రి గ్రూప్ డి సిబ్బంది ద్వారా డాక్టర్‌కు అందజేశారు. ఎలాగోలా డబ్బులు తెచ్చిచ్చామని లేకపోతే తల్లీ, బిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.  ఎమర్జెన్సీ సమయంలో ఇలా  అన్యాయంగా  ఎందుకు వ్యవహరిస్తున్నారని డాక్టర్ ను గర్భిణి బంధఉవులు ప్రశ్నించారు.  ఆమె "అందరూ చెల్లిస్తారు" అని సమాధానమిచ్చిందని వీడియోలో రికార్డు అయింది.                

ఫోన్ లో రికార్డు చేసి..  లోకాయుక్తలో కేసు పెట్టిన గర్భిణి బంధువు           

ఈ ఘటనపై బాధితులు తుమకూరు లోకాయుక్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్‌లో డాక్టర్‌తో జరిగిన సంభాషణను రికార్డ్ చేశారు. ఆ వీడియో   ఆధారంగా కేసు నమోదైంది. లోకాయుక్తా పోలీసుల దర్యాప్తు తర్వాత, తుమకూరు స్పెషల్ కోర్టు డాక్టర్ మహాలక్ష్మమ్మకు 5 సంవత్సరాల జైలు శిక్ష .జరిమానా విధించింది.  ఈ సంఘటన  ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలు, పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేస్తోంది. ఇటీవల కూడా యలహంకా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో డాక్టర్ రామచంద్ర రూ. 11 వేల లంచం డిమాండ్ చేసిన సంఘటనలో సస్పెన్డ్ అయ్యాడు.              

ఈ శిక్ష భవిష్యత్తులో డాక్టర్లు, సిబ్బంది లంచాలు తీసుకోవాలంటే భయం పుట్టేలా చేస్తుందని భావిస్తున్నారు.  "ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు ఉచిత చికిత్స అందించాలి, కానీ ఇలాంటి లంచాలు అన్యాయం," అని బాధిత కుటుంబం తెలిపింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget