Adilabad Latest News: బార్‌కెళ్లి తాగిన ఇంజినీరింగ్ స్టూడెంట్స్- బిల్ చెల్లించాలని జూనియర్‌పై ర్యాగింగ్- తట్టుకోలేక విద్యార్థి సూసైడ్
Adilabad Crime News: ఉన్నత చదువులతో హైదరాబాద్ వచ్చిన ఆదిలాబాద్ విద్యార్థిని ర్యాంగింగ్ బలి తీసుకుంది. తోటి విద్యార్థులే అతని చావుకు కారణయ్యారనే వార్త ఓ కుటుంబాన్ని విషాదంలో నెట్టింది.

Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నగలకొండ గ్రామానికి చెందిన జాదవ్ సాయి తేజ ఘట్కేసర్‌లోని ఉప్పల్ మేడిపల్లి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై స్థానికు నాయకులతో కలిసి బంధవులు ధర్నా చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తేజ చదువుతున్న కాలేజీలోని కొందరు సీనియర్ విద్యార్థులు మద్యం తాగమని బలవంతం పెట్టారు. అంతే కాదు అతన్ని తీసుకొని బార్‌కు వెళ్లారు. అక్కడ తేజాకు మందు పోసి వాళ్లు కూడా తాగారు. మొత్తానికి బిల్‌ను పదివేల రూపాయలు చేశారు. ఆ బిల్ కూడా తేజతోనే కట్టించే ప్రయత్నం చేశారు. దీన్ని అవమానంగా భావించిన తేజ అక్కడి నుంచి తను ఉంటున్న రూమ్‌కు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలిసిన వెంటనే ఉట్నూర్ మాజీ జెడ్పిటిసి చారులత రాథోడ్ మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కి చేరుకుని బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం నింపారు.

అదే సమయంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట చారులత రాథోడ్ స్థానికులతో కలిసి ధర్నా నిర్వహించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. ఉట్నూర్ మాజీ జెడ్పిటిసి చారులత రాథోడ్ ఏసీపీని కలసి వినతి పత్రం అందజేారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించాలని కోరారు. ప్రభుత్వం, పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.






















