బ్యాంకుకు కన్నం వేసి చోరీకి యత్నించిన దుండగులు, మెదక్‌లో ఘటన
Medak Bank Robbery | మెదక్ జిల్లాలోని వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొందరు గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. అలారం మోగడంతో పరారయ్యారు.

Bank Robbery In Medak | వెల్దుర్తి: మెదక్ జిల్లాలో కొందరు దుండగులు ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టి చోరీకి యత్నించారు. వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీకి యత్నం జరిగింది. సోమవారం (జూన్ 30న) తెల్లవారుజామున దొంగలు బ్యాంకు గోడలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్టోర్ రూమ్ వెనుక నుంచి తాళాలు పగలగొట్టారు. తరువాత నిందితులు లాకర్స్ రూమ్ దగ్గరికి వెళ్ళగానే అలారం మోగింది.
అలారం మొగడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలారం మోగడంతో అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.























