అన్వేషించండి

Hyderabad Fire Accident: పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం, రియాక్టర్ పేలి 10 మంది మృతి! 20 మందికి గాయాలు

Patancheru Fire Accident | హైదరాబాద్ శివారులోని పటాన్ చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీగాచి కెమికల్స్ కంపెనీలో రియాక్షర్ పేలడంతో విషాదం నెలకొంది.

Chemical Tanker Blast at Sigachi Chemicals in Hyderabad | హైదరాబాద్: పటాన్ చెరులోని ఓ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాశమైలారం లోని సీగాచి కెమికల్స్ కంపెనీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల వరకు ఎగిరిపడ్డారని సమాచారం. పేలుడు ధాటికి షెడ్డూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు కార్మికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తరువాత అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.


Hyderabad Fire Accident: పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం, రియాక్టర్ పేలి 10 మంది మృతి! 20 మందికి గాయాలు

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పాశమైలారంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు యత్నిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. రియాక్టర్ పేలడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో కంపెనీలో ఎంత మంది ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది.

 

పూర్తిగా కూలిపోయిన అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌

పేలుడు ధాటికి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోయింది. ఆ బిల్డింగ్‌లో పెద్దఎత్తున కార్మికులు ఉన్నారు. రెస్క్యూ టీమ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ భవనం నుంచి ఆరుగురిని మాత్రమే బయటకుతీసుకొచ్చాయి. మరోవైపు  హైడ్రా, ఫైర్‌, పోలీస్‌ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నారు. హైడ్రా భారీ క్రేన్లను రప్పించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యత్నిస్తోంది. సహాయక బృందాలు అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ శిథిలాలను తొలగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 20 మందిని చందానగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో 18 మందిని ఇస్నాపూర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిసత్ున్నారు. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో కార్మికులు ప్రాణభయంతో కంపెనీలో నుంచి బయటికి పరుగులు పెట్టారు. కెమికల్ ఫ్యాక్టరీలో మంటల వల్ల ఘాటైన వాసన వస్తోంది. ఘాటైన వాసనలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శిథిలాల కింద 15 మంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
Hyderabad Fire Accident: పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం, రియాక్టర్ పేలి 10 మంది మృతి! 20 మందికి గాయాలు

చుట్టుపక్కల ప్రాంతాల వారు అక్కడికి రాకుండా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అసలే కెమికల్ ఫ్యాక్టరీ కావడం, అందులోనూ పేలుడుతో ఘాటైన వాయువులు లీకవుతున్నాయి. విష వాయువులు పీల్చితే మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రాణాలు సైతం పోయే అవకాశం ఉందని పోలీసులు అక్కడికి ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget