Breaking News: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, వరుడు సహా 9 మంది దుర్మరణం
Car fell into the Chambal river: కారు లోయలోకి దూసుకెళ్లడంతో రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వరుడు సహా 9 మంది దుర్మరణం చెందారు.
Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో వరుడు సహా అతడి కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఉజ్జయినికి కారులో వెళ్తుండగా రాజస్థాన్ లోని కోట సమీపంలో కల్వర్టు వద్ద వీరి వాహనం ప్రమాదానికి గురై చంబల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుడు సహా 9 మంది చనిపోయారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
అప్పటివరకు ఆ కుటుంబంలో అంతా సంతోషమే. మరికొన్ని గంటల్లో ఇంట్లో శుభకార్యం జరగనుంది. తమ కుమారుడి వివాహం ఘనంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు ప్లాన్ చేశారు. వధువు కుటుంబం వరుడి ఫ్యామిలీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. కానీ విధి మరోలా ఉంది. మార్గం మధ్యలోనే వరుడి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలైంది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వధువు కుటుంబానికి పోలీసులు సమాచారం అందించారు.
Rajasthan | Eight people died after their car fell off Chhoti Puliya and into the Chambal river in Kota. The occupants of the car were going to a wedding. The car was retrieved with the help of a crane. pic.twitter.com/TYjWlioP2q
— ANI (@ANI) February 20, 2022
శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం..
రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం ఉజ్జయినీలో తమ కుమారుడి వివాహం చేయాలని నిశ్చయించింది. ఆదివారం ఉదయం వరుడితో పాటు కుటుంబసభ్యులు ఉజ్జయినీకి కారులో బయలుదేరాడు. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదనికి గురైంది. కోటా సమీపంలో వాహనం అదుపుతప్పి, చంబల్ నది ఓ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అధికారులు మొదట 8 మంది చనిపోయారని చెప్పారు, అనంతరం మరో వ్యక్తి సైతం చనిపోయాడని తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. క్రేన్ సహాయంతో రెస్క్యూటీమ్ కారును, మృతదేహాలను వెలికితీసింది. పోస్టుమార్టం నిమిత్తం కోటలోని ఆసుపత్రికి మృతదేహాలను పోలీసులు తరలించారు.
Also Read: Hyderabad: హాస్టల్‌లో నిద్రలేచిన విద్యార్థులకు భారీ షాక్! వెంటనే ప్రిన్సిపల్ వద్దకు పరుగులు
Also Read: AP Volunteer: వామ్మో వాలంటీరు! పెళ్లికి వెళ్తున్నానని చెప్పి రూ.3 కోట్లతో మహిళ పరారీ