By: ABP Desam | Updated at : 21 Sep 2021 02:58 PM (IST)
Edited By: Venkateshk
రాజ్ కుంద్రా (ఫైల్ ఫోటో)
పోర్న్ చిత్రాల వ్యాపారం కేసులో బెయిల్ పొందిన వెంటనే రాజ్ కుంద్రా వ్యవహారంలో మరో సంచలన వ్యవహారాన్ని ముంబయి పోలీసులు మంగళవారం బయటపెట్టారు. రాజ్ కుంద్రా ఫోన్, ల్యాప్ ట్యాప్‌లలో తాము 119 పోర్న్ వీడియోలను గుర్తించామని ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రకటించారు. వాటిని రూ.9 కోట్లకు అమ్మి సొమ్ము చేసుకోవాలని రాజ్ కుంద్రా యత్నించినట్లుగా వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడు యశ్ ఠాకూర్ అలియాస్ అరవింద్ శ్రీవాస్తవ, రాజ్ కుంద్రా అనుచరుడు ప్రదీప్ బక్షిపై ముంబయి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: Modi-Biden Meet: మోదీ-బైడెన్ భేటీకి ముహూర్తం ఫిక్స్, క్వాడ్ దేశాల భేటీ కూడా.. వైట్ హౌస్ ప్రకటన
రాజ్ కుంద్రా గత రెండు నెలలుగా ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటున్నారు. తాజాగా ఆయనకు ముంబయిలోని మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన సోమవారమే బయటికి వచ్చారు. రూ.50 వేల పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆ వెంటనే ఆయన ఫోన్లో గుర్తించిన పోర్న్ వీడియోల గురించి పోలీసులు వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: Viral video: కదులుతున్న ట్రైన్‌ని ఎక్కబోయి జారిన మహిళ... చివరికి ఏమైందో చూడండి
మరోవైపు, ఇదే కేసులో కుంద్రా అనుచరుడు రియాన్ థ్రోప్ జులై 19న అరెస్టు కాగా ఆయనకు కూడా బెయిల్ మంజూరైంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త అయిన రాజ్ కుంద్రాపై ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు ఐటీ యాక్ట్ సహా వివిధ చట్టాల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వివిధ వ్యక్తులతో పోర్న్ చిత్రాలు తీసి వాటిని వివిధ యాప్‌లలో పబ్లిష్ చేస్తున్నారన్న ఆరోపణలపై రాజ్ కుంద్రాపై పోలీసులు ఈ కేసు పెట్టారు.
Also Read: Hyderabad: మీకు పని మనిషి ఉన్నారా? తస్మాత్ జాగ్రత్త! మీకూ ఇలా జరగొచ్చు.. ఇదో కొత్త రకం మోసం
Actor #ShilpaShetty's husband, Businessman #RajKundra walks out of #Mumbai's Arthur Road jail, a day after a court granted him bail in #Pornographic films case after furnishing a bond of ₹50k. pic.twitter.com/kFVE1BChLf
— Jyothi Jha (@jyothi_jha) September 21, 2021
Raj Kundra breaks down on getting bail after 2 months in jail#rajkundra #shilpashetty #bollywoodtashan #bollywood pic.twitter.com/IaNWbQxSU5
— Bollywood Tashan (@Bollywodtashan) September 21, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?
Tirupati Crime News: మైనర్‌పై వాలంటీర్ అత్యాచారయత్నం, నిందితుడిపై పోక్సో కేసు నమోదు
MLC Kavitha: సుదీర్ఘంగా కవితను విచారించిన ఈడీ, మళ్లీ నేడు రావాలని నోటీసులు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా