అన్వేషించండి

Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్

Lonavala Fort Hoodie Murder Mystery: పుణె కేతన్ అగర్వాల్ ను కాబోయే భార్య హత్య చేసిన ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాయ్ ఫ్రెండ్ చేతన్ లాయర్ .. అంతా సియానే చేసిందని అంటున్నారు.

Siya Goyal Boyfriend Chetan Arrested:  మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలో గల లోహగఢ్ కోట వద్ద పుణేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్  అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో ఇది పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యగా తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తో పాటు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే, ఈ మర్డర్ మిస్టరీలో చేతన్ చౌదరి పాత్రపై ఆయన తరఫు డిఫెన్స్ లాయర్ మరియు తండ్రి కోర్టు వెలుపల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. కేతన్ హత్యతో చేతన్‌కు ఎలాంటి సంబంధం లేదని, అతను కేవలం సియా గోయల్ ప్రియుడు అనే ఒకే ఒక్క కారణంతో ఈ కేసులోకి లాగారని వారు వాదిస్తున్నారు. 

 ఎఫ్ఐఆర్‌లో  అంతా గాలి ఆరోపణలే   

ఈ కేసులో చేతన్ చౌదరి తరఫున కోర్టులో వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది రామ్ షహానీ  పోలీసుల ఎఫ్‌ఐఆర్ లో చేతన్ పాత్రపై ఎలాంటి స్పష్టత లేదని పేర్కొన్నారు.  పోలీసులు దాఖలు చేసిన ప్రాథమిక నివేదికను గమనిస్తే, చేతన్‌పై మోపిన ఆరోపణలేవీ శాస్త్రీయంగా లేవు. హత్యలో అతని నిర్దిష్ట పాత్ర ఏమిటో ఎక్కడా వివరించలేదు. కేవలం సియా గోయల్‌కు బాయ్‌ఫ్రెండ్ అనే ఒకే ఒక్క లైన్‌తో అతనిని ఈ కేసులో ఇరికించారు  అని లాయర్ ఆరోపించారు. కేసు ఇంకా ప్రాథమిక విచారణ దశలోనే ఉందని, పోలీసులు అడిగిన ఏడు రోజుల కస్టడీ కేవలం అనుమానాల ఆధారంగానే సాగుతోందని, తమ క్లయింట్ నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.   

 ఎండలో హుడీ.. పోలీసుల అనుమానాలకు కారణం ఇదే! 

మరోవైపు లోనావాలా రూరల్ పోలీసులు మాత్రం నిందితులపై బలమైన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. జూన్ 18న కేతన్ అగర్వాల్, సియా గోయల్‌తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినప్పుడు, చేతన్ చౌదరి వారి కంటే ముందే అక్కడికి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఆ రోజు మధ్యాహ్నం 33 డిగ్రీల సెల్సియస్ ఎండ తీవ్రత ఉన్నప్పటికీ.. కోట కింద ఉన్న సీసీటీవీ  ఫుటేజీలో ఒక వ్యక్తి తలకు క్యాప్ ఉన్న హుడీ  టీషర్ట్ వేసుకుని, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అనుమానాస్పదంగా తిరగడం లోనావాలా రూరల్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దినేష్ తాయ్డే దృష్టిని ఆకర్షించింది. అంతటి ఎండలో అలాంటి దుస్తులు ధరించడం వెనుక గుర్తింపు దాచాలనే కుట్ర ఉందని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ జరపగా, ఆ హుడీ ధరించిన వ్యక్తి చేతన్ చౌదరి అని తేలింది.  

 ఫోన్ ఇంట్లోనే వదిలేసి స్కెచ్.. నిందితుల మధ్య 2,000 కాల్స్! 

టెక్నికల్ ఎవిడెన్స్ దొరకకుండా ఉండేందుకు చేతన్ చౌదరి చాలా తెలివిగా వ్యవహరించాడని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. లోహగఢ్ కోటకు వెళ్లే సమయంలో తన లొకేషన్ ట్రేస్ కాకుండా ఉండేందుకు కొంధ్వాలోని తన నివాసంలోనే మొబైల్ ఫోన్‌ను వదిలి వెళ్లాడని దర్యాప్తులో తేలింది. అయితే, ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఇతర సీసీటీవీ కెమెరాల ద్వారా అతని కదలికలను పోలీసులు పక్కాగా ట్రాక్ చేశారు. అంతేకాకుండా, గత కొన్ని రోజుల్లో సియా గోయల్, చేతన్ చౌదరిల మధ్య ఏకంగా 2,000కు పైగా ఫోన్ కాల్స్ నడిచాయని, ఇద్దరూ కలిసి ఈ హత్యకు ప్లాన్ చేశారని పోలీసులు చెబుతున్నారు. తమ ఇంటరాగేషన్‌లో ఇద్దరూ తప్పు ఒప్పుకున్నారని  పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

 ప్రియుడి తండ్రి ఆవేదన! 

 చేతన్ చౌదరి తండ్రి కూడా తన కొడుకు అమాయకత్వాన్ని సమర్థిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. సియాతో స్నేహం వల్లే తన కొడుకు ఈ దారుణమైన పరిస్థితిలోకి వెళ్లాడని, ఒక పెద్ద పారిశ్రామికవేత్త హత్య కేసులో అతనిని ప్రధాన సూత్రధారిగా చూపించడం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తంచేస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం చేతన్ నేర చరిత్ర లేదా ఆర్థిక కోణాలను కూడా పరిశీలిస్తున్నారు. కేవలం ప్రేమ వ్యవహారమేనా లేక డబ్బు కోసమే ఈ హత్య చేశారా అనే కోణంలో లోనావాలా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కోర్టు అనుమతించిన ఈ 7 రోజుల పోలీస్ కస్టడీ ముగిసేలోగా ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget